Karthika Deepam October 29th Episode 1496 (కార్తీకదీపం అక్టోబరు 29 ఎపిసోడ్)
తెల్లారగానే దీప...శౌర్య దగ్గరకు వెళ్తానని చెప్పిందని వాల్తేరు వాణి మోనితకు చెబుతుంది.
మోనిత: ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పాపని కలవకూడదు... పాపని కలిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితానికి ఇంకే అడ్డు ఉండదు
వాణి: నిజంగానే ఆ పాప వాళ్ళిద్దరి పాప! కార్తీక్ దీప భర్తా! అని ఆశ్చర్యపోతుంది
మోనిత: కార్తీక్ ను ప్రేమించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఏం జరిగిందో మొత్తం చెబుతుంది. కార్తీక్ కోసం ఎన్నో చేశాను కార్తీక్ మీద ప్రేమతోనే బిడ్డను కూడా కన్నాను . ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు అన్నీ కార్తీక్ కోసమే చేశాను. ఇన్ని రిస్కులు తీసుకున్న తర్వాత కార్తీక్ ని తీసుకొచ్చేసి ఇక్కడ హాయిగా ఉంటే మళ్ళీ ఆ దీప వచ్చింది..దుర్గ వచ్చాక మొత్తం మారిపోయింది
వాణి:మీకు కార్తీక్ ని అప్పిగించి వెళ్తాను..మీ ప్రేమకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి..నాకు డబ్బులు కూడా అవసరం లేదు
మోనిత: రెండు లక్షలు ఇస్తాను అన్నాకదా..కాదు కాదు..పది లక్షలు ఇస్తాను... వాళ్లు రేపు ఉదయం సూర్యోదయం చూడకూడదు
వాణి: ఈ వాణి ఉండగా మీకు అన్యాయం జరగదు.. పొద్దున్న కల్లా పనిపూర్తిచేస్తాను..డబ్బులు రెడీ చేసుకోండి
Also Read: రిషి కన్నీళ్లు చూసి కరిగిపోయిన వసు, ఈగో మాస్టర్ ముందు దేవయానిని బుక్ చేసిన వసుధార
దీప పిండివంటు చేస్తుంటే కార్తీక్ వచ్చి..శౌర్య కోసం చేస్తున్నావని నాకు తెలుసులే అనుకుంటూ.. ఇదంతా శౌర్య కోసమేనా అని అడగితే అవును డాక్టర్ బాబు అంటుంది. ఇంతలో వాల్తేరు వాణి వచ్చి..పొద్దున్నే మీరు వెళ్లడం కాదు..ఈ రాత్రికే పైకి పంపించేస్తాను అనుకుంటుంది. ఇంకా ఎంత సేపు చేస్తావు వదినా, పని పూర్తిచేసుకుని తొందరగా పడుకో వదినా పొద్దున్నే పాపని చూడడానికి వెళ్లాలి కదా...
మరోవైపు మోనిత..తన గదిలో కూర్చుని ఆనంద్ ని చూస్తూ కార్తీక్ అన్న మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. కార్తీక్ ప్రవర్తన చూస్తే కొన్ని సార్లు గతం గుర్తొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు ఈమధ్య పూర్తి అనుమానాలు పెరిగిపోయాయి. అనుమానాలు తొలగించేసరికే టైం గడిచిపోతోంది. అసలు నేను భార్యను కానట్టే మాట్లాడుతున్నాడు...దీప దగ్గరకు వెళ్లి కూర్చుంటున్నాడు..ఇప్పుడే ఇలా ఉంటే గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి.. నిజంగా గతం గుర్తొచ్చేసి ఉంటుందా? ఒకవేళ గుర్తొస్తే నన్ను ఇలా ఉండడే నన్ను కాదని దీప దగ్గరకు వెళ్లిపోతాడు కదా..ఒకవేళ గుర్తొచ్చినా గుర్తురానట్టు నాటకం ఆడుతున్నాడా..అయినా దానివల్ల ఏంటి లాభం.. అనవసరంగా టెన్షన్ పడుతున్నాను..ఆ దుర్గగాడు చేసిన ఓవరాక్షన్ వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు... ఆ దుర్గ-దీప అడ్డు తొలగితే కానీ నాకు పట్టిన శని వదలదు..వాణి వాళ్ల సంగతి చూసుకుంటానందికదా..ఆ అడ్డుతొలిగిపోతే భవిష్యత్ అంతా నాదే...
అటు...దీప ఇంటిబయట నిల్చున్న వాల్తేరు వాణి..మోనితపై పగబట్టానంటూ వదినా అనగానే నన్ను భలే నమ్మావ్.. చివరికి ఈ గుడెసెలో ఇలా మాడిమసైపోతున్నావ్..రెస్ట్ ఇన్ పీస్...ఈ లోగా దుర్గ అక్కడకు వస్తాడు... ఆ ఇంటిపై పోసింది పెట్రోల్ కాదు నీళ్లు..ఎట్టకేలకు దొరికిపోయావ్..నిన్ను ఆమోనితే పంపిందికదా..అంతకన్నా ఎవరికి అవసరం ఉంటుంది..మోనితతో నీ ఓవరాక్షన్ చూసినప్పుడే అర్థమైంది అంటాడు..మిమ్మల్ని మాత్రం మిస్కానివ్వను అంటాడు..
నిద్రలేచిన మోనిత..రాత్రికి ఇల్లు తగులబెట్టేస్తానందికదా వాణి... ఈ పాటికి ఇల్లు, ఇంట్లో దీప కాలిబూడిదైపోయి ఉంటుంది అనుకుంటూ బయటకు వెళ్లి చూస్తుంది. దీప హాయిగా ఇంటి బయట కల్లాపు వేసుకుంటుంది. వాణికి ఫోన్ చేద్దామని కోపంగా ఫోన్ చేస్తుండగా దుర్గా ఫోన్ లాక్కొని ఏం బంగారం వాల్తేర్ వాణి కి ఫోన్ చేస్తున్నావా అని ఎంట్రీ ఇస్తాడు
దుర్గ: నిన్న నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా కావేరికు పార్సెల్ చేసేసాను
మోనిత: తను ఎలా ఉంటే నాకెందుకు అని నటిస్తుంది
దుర్గ: దానికి దుర్గ, మీరిద్దరూ ఒక టీమే అని నాకు తెలుసు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత నిజం అంతా కక్కేసింది. ఈ విషయం గాని కార్తీక్ సార్ కి తెలిస్తే అని అనేలోగా
కార్తీక్: ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మీరు నా గురించి కూడా మాట్లాడుకుంటారా? మీ మధ్యలో నేనొకడు ఉన్నారని కూడా మీకు తెలుసా ఎప్పుడు నన్ను బకరా చేద్దామని మాట్లాడుకుంటుంటారా అని కోపంగా వెళ్లిపోతాడు
మోనిత: ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు నాతోని
దుర్గ: నేను ఆడుకోవడం లేదు బంగారం. కార్తీక్ సార్ నీ మీద చూపిస్తున్న అనుమానం ఉన్నది చూడు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు ఇది ఆనందం అంటే అయినా నీకు తెలుసు కదా దీపమ్మ జోలికి వేస్తే బొమ్మ ఇలాగే ఉంటుంది. ఇదిగో ఫోన్ తీసుకో జాగ్రత్త అని వెళ్లిపోతాడు దుర్గ.
Also Read: మోనిత కుట్రకు మరోసారి దీప బలి, తనలో రాక్షసుడిని బయటకు తీసిన కార్తీక్
దీప ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఏంటి మీరు డాక్టర్ బాబు ఇంకా బయలుదేరలేదు అని అనగా పిండి వంటలు అన్ని రెడీ చేసావు కదా నేను బయలుదేరడం ఎంతసేపు రెండు నిమిషాల్లో మార్చుకొని వస్తాను. ఇంతకీ మీ వాణి ఏది కనిపించడం లేదు అని అంటాడు కార్తీక్. ఏమో డాక్టర్ బాబు ఉదయం నుంచి కనిపించడం లేదు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని దీప అంటుంది. అయితే పని ఉండి వెళ్ళిందేమో అని కార్తీక్ అంటాడు.
ఎపిసోడ్ ముగిసింది
సోమవారం ఎపిసోడ్ లో
నా మనసు చెబుతోంది డాక్టర్ బాబు నా బిడ్డ ఇక్కడే ఉంది అనుకుంటుంది దీప. అటు శౌర్య కి కూడా తన తల్లిదండ్రులు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మరి చూసుకుంటారో లేదో సోమవారం తెలుస్తుంది...