సామ్రాట్ తులసి గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అటు ఇంట్లో లాస్య సామ్రాట్, తులసి గురించి నీచంగా మాట్లాడుతుంది. పెళ్లి తర్వాత జరుపుకోవాల్సిన మొదటి రాత్రి తంతుని ముందే కానిచ్చేశారు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది తులసి అని లాస్య అంటుంది. పెళ్లి తర్వాట జరుపుకోవాల్సిన తంతుని పెళ్ళికి ముందే ఒక పెళ్ళైన వాడితో నా కళ్ళ ముందే నా బెడ్ రూమ్ లో నువ్వు జరుపుకున్నావ్ లాస్య మర్యాదకి, సంప్రదాయాన్ని కట్టుబాట్లని దాటింది నువ్వు.. సమాజానికి విలువ ఇవ్వకుండా విచ్చలవిడిగా ప్రవర్తించింది నువ్వు నీ నందు నేను కాదు అని గట్టిగా బదులు చెప్తుంది.
ఆవేశంలో నన్ను అన్నేసి మాటలు అన్నారే అవన్నీ అనాల్సింది నన్ను కాదు నీ కొడుకు, కోడలిని అని తులసి ఆవేశంగా అనసూయతో అంటుంది. నాన్న అన్న దాంట్లో అని అభి మాట్లాడబోతుంటే నోర్ముయ్ చెంప పగలగొట్టాను అంటే వెళ్ళి మీ అత్తారింట్లో పడతావ్ మాట్లాడకు అని తిడుతుంది. ఈరోజు ఇప్పుడే తులసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అంటుంది. కానీ ఒక్కతే కాదు ఈ ఇంట్లో ముఖ్యమైనవి అన్నీ తీసుకుని వెళ్తాను అని అంటుంది. ఇంటి నుంచి డబ్బు, నగలు తీసుకుని వెళ్ళడానికి నేను అసలు ఒప్పుకోను అని లాస్య అంతే నేను తీసుకెళ్ళేది నా గౌరవం, మర్యాద, ఆత్మాభిమానం అని చెప్తుంది. తులసిని వెళ్లొద్దని ప్రేమ్, అంకిత, దివ్య, శ్రుతి బతిమలాడతారు. అప్పుడే తులసిని ఎవరు ఆపడానికి వీల్లేదని పరంధామయ్య ఎంట్రీ ఇస్తాడు.
Also Read: ఎట్టకేలకి దేవి చెంతకి ఆదిత్య, రుక్మిణి- అక్కడ మాధవ్ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన రాధ
తులసి: నేను ఈ ఇంట్లో ఉండలేను మావయ్య
పరంధామయ్య: నువ్వు ఉంటాను అన్న నేను ఉండనివ్వనమ్మా అంతా విన్నాను వీళ్ళు ఎలా మాట్లాడరో నేను అర్థం చేసుకోగలను
అనసూయ: అసలు జరిగింది ఏంటో మీకు తెలియదు
పరంధామయ్య: జరిగింది ఏంటో తెలియక పోవచ్చు కానీ మీ ముగ్గురు మనసులో ఎంతగా కుళ్లిపోయాయో నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంత వరకు దిగజారగలరో నాకు తెలుసు. ఇలాంటి దిగజారిన మనుషుల మధ్య నా బిడ్డ ఉండలేదు ఉండదు. తప్పు నాదేనమ్మా అని చేతులెత్తి దణ్ణం పెడతాడు. ఇది అందమైన ఊరు అనుకున్నా కానీ పంజరం అవుతుందని అనుకోలేదు. ఈ పంజరం వదిలి స్వేచ్చగా ఎగిరిపో.. ఒక్కదాన్ని మాత్రం తలగబెట్టి వెళ్ళు. గిల్టీ లేకుండా వెళ్ళు. ఈ కుటుంబానికి విశ్వాసం లేదు.
ప్రేమ్: నిజం అమ్మా ఈ కుటుంబం నీకు తగినది కాదు
కొందరి నోటి దురుసు మా జీవితాలని చీకటి చేసిందని శ్రుతి, అంకిత బాధపడతారు. వెళ్లిపొమ్మ నువ్వు ఇక్కడ వద్దు అని ప్రేమ్ అంటాడు. నేను కూడా అమ్మతో పాటే వెళ్తాను అని ప్రేమ్ పరంధామయ్యకి చెప్తాడు. తులసి భజన బ్యాచ్ అంతా చప్పట్లు కొడుతూ మరి ముందు నడువు వెళ్లిపో అని ఎంకరేజ్ చేస్తారు.తులసి బట్టలు సర్దుకుని బయటకి వెళ్లేందుకు కిందకి వస్తుంది. నన్ను కూడా నీతో తీసుకెళ్లు మామ్ అని దివ్య ఏడుస్తుంది. ఇది నా సమస్య నా వల్ల ఇంటిని ముక్కలు చేశాను అని అపవాదు వద్దు, నేను లేకపోయినా మీరు బాధ్యతగా ఉండండి అని తులసి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ప్రేమ్ నువ్వు నాతో శాశ్వతంగా రావడం లేదు కేవలం కొన్ని గంటలే అని తులసి చెప్తుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లాస్య ఫుల్ ఖుషీగా ఉంటుంది.
Also Read: అభి, ప్రేమ్ కొట్లాట- తులసిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న పరంధామయ్య
తులసి వెంటే ఏడుస్తూ పిల్లలు బయటకి వస్తారు. తులసి వెళ్లిపోతుంటే ఒక్క క్షణం అనసూయ కూడా బాధపడుతుంది కానీ పైకి మాత్రం కోపంగా చూస్తుంది. తులసితో పాటే ప్రేమ్ కూడా వెనుక వెళ్తూ ఉంటాడు. కానీ తులసి మాత్రం ప్రేమ్ ని ఆగిపొమ్మని చెప్పి తను ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకి వస్తాను అని ప్రామిస్ చెయ్యమని ప్రేమ్ అడుగుతాడు. తులసి పప్రామిస్ చేసి ఒంటరిగా నడిచి వెళ్ళిపోతుంది.