Karthika Deepam November 10th  Episode 1506 (కార్తీకదీపం నవంబరు 10 ఎపిసోడ్)


కార్తీక్..దీప ఇంటికి వెళ్తాడు. తాళం వేసి ఉండటంతో.. దీప ఎక్కడికి వెళ్లింది పొద్దున్నే అనుకుంచాడు. మరోవైపు దీప గుడిలో దేవుడికి సేవ చేస్తుంటుంది. అదంతా చాటుగా చూసిన మోనిత..‘పొద్దున్నే ఎక్కడికిపోతుందా? అని ఫాలో అయితే.. ఇది ఇక్కడికి వచ్చి గుడి సేవలు చేస్తోంది ఏంటో... సేవలు చేస్తే కష్టాలు తీరిపోతాయా.. అయినా ఇప్పటికిప్పుడు దీనికి అంత కష్టం ఏమొచ్చింది. మొగుడు సొంత కాకపోయినా ఎదురుగా అయినా ఉంటున్నాడు కదా... అంత కన్నా పెద్ద కష్టం ఏదైనా వచ్చిందా? నాకు తెలియనిది ఏదైనా ఉందా?’ అని మనసులో అనుకుంటుంది మోనిత. పంతులు దగ్గరకు వెళ్లి.. ‘పంతులు గారు పాపం ఆవిడకు ఏం కష్టం వచ్చిందట అని అడిగితే..‘తెలుసుకుని ఏం చేస్తావ్ తల్లీ.. ఎవరి కష్టమైనా తీర్చగలిగితే తెలుసుకోవాలి. లేదంటే పట్టించుకోవద్దు’ అంటాడు. ‘అది సరే పంతులుగారు.. ఈ రోజు కార్తీకపౌర్ణమి కగా రాత్రి 365 ఒత్తులు వెలిగిస్తే మంచిదట కదా అని అడిగిన మోనితతో..‘అవునమ్మా మంచిదే  అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తాను అని చేయకూడదు..భక్తితో చేయాలని సెటైర్ వేస్తాడు. 


Also Read: కార్తీక్ కొట్టిన చెంపదెబ్బకి మోనిత రియాక్షన్, కార్తీకదీపం కథలో మరో కీలక మలుపు


మరోవైపు ఇంటికెళ్లిన కార్తీక్..దీప గురించే ఆలోచిస్తుంటే బాబు ఏడుపు వినిపిస్తుంది. శివలత వచ్చి.. ‘మేడమ్ లేదు బయటికి వెళ్లింది’ అని చెబుతుంది. ‘బాబుని వదిలేసి ఎక్కడికి వెళ్లింది..వెళ్లి ఎత్తుకో అని శివలతని పంపించేసి మళ్లీ దీప గురించి ఆలోచిస్తాడు. ఇంతలో పూజ సామాగ్రితో ఎంట్రీ ఇస్తుంది మోనిత. ఈ రోజు కార్తీకపౌర్ణమి మనిద్దరం పూజ చెయ్యాలి రాత్రికి నువ్వు ఏ పనులు పెట్టుకోకు.. దంపతులు పూజ చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయట’ అంటుంది మోనిత. అడ్డంకులు అని చెబుతోంది ఏంటి దీపని ఏదైనా చేయబోతోందా అని మనసులో అనుకుంటాడు కార్తీక్. 
కార్తీక్: వంటలక్కని.. ఏమైనా చూశావా
మోనిత: గుడి దగ్గర చూశాను.. పాపం గుడి దగ్గర ఊడ్చుకుంటూ కనిపించింది. గుడి మెట్లు కడుక్కుంటూ పాపం చాలా కష్టపడుతోంది. ఆల్ మోస్ట్ అడుక్కుని తినే పరిస్థితి అనుకో కార్తీక్ అంటూ...కార్తీక్ మొహంలో బాధ కనిపించడం చూసి..ఏంటి కార్తీక్ అలా అయిపోయావని అడుగుతుంది మోనిత..
కార్తీక్: ఏం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు 
కార్తీక్ కి..గతం గుర్తొచ్చిందేమో అనే డౌట్ పడుతుంది మోనిత...


Also Read: వసుధారకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, ఈగోని మళ్లీ తట్టిలేపిన పొగరు


మరోవైపు ఇంద్రుడు-చంద్రమ్మ డబ్బులు లెక్కేసుకుంటుండగా శౌర్య వచ్చి  అమ్మా నాన్నని వెతికేందుకు వెళదా అంటుంది. రేపు పొద్దున్నే ఫస్ట్ బస్ కి వెళదాం అంటాడు ఇంద్రుడు. ఆటో ఏదని అడిగితే..నడుం నొప్పి ఆటోతోలకూడదని డాక్టర్ అంటే అమ్మేశానని చెబుతాడు ఇంద్రుడు. వాళ్ల మాటతీరు చూసి శౌర్యకి అనుమానం వస్తుంది... ఇంద్రుడు చంద్రమ్మ మాత్రం బిడ్డని దక్కించుకోవాలంటే ఈమాత్రం చేయక తప్పదు అనుకుంటారు..




మరోవైపు దీప ఇంటికి వచ్చిన కార్తీక్..గుడి మెట్లు కుడుగుతున్నావా అని అడుగుతాడు. 
దీప: ‘అవును డాక్టర్ బాబు.. నా బిడ్డ నాకు కనిపించేంత వరకూ అలానే చేస్తానని మొక్కుకున్నాను.. దేవుడి దయతోనైనా నా బిడ్డ నాకు దొరికితే అదే చాలు’. ‘డాక్టర్ బాబు ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా.. గుడిలో 365 ఒత్తులు వెలిగించి పూజ చేస్తే అనుకున్నది జరుగుతుందంట. అడగటానికే ఏదోలా ఉంది.. ఆరు వందల రూపాయలు ఉంటే ఇస్తారా?’
కార్తీక్: గతంలో నాకేంటి డాక్టర్ బాబు భార్యని లక్షలు అడ్వాన్స్ గా ఇస్తా అన్న దీప మాటలుగుర్తుచేసుకుని బాధపడతాడు కార్తీక్..‘ఇంకెప్పుడు నువ్వు డబ్బులు కోసం ఇబ్బంది పడకూడదు.. ప్రస్తుతానికి ఈ డబ్బులు ఉంచు’ అని ఇవ్వబోతాడు
మధ్యలో వచ్చిన మోనిత ఆ డబ్బులు లాక్కుని.. ‘బంగారం తాగట్టు పెట్టి నువ్వు ఈ పని చేస్తున్నావా కార్తీక్’ అని కావాలని రెచ్చగొడుతుంది..( నిజంగా కార్తీక్ కి గతం గుర్తొస్తే నేను అన్న మాటలకి కొడతాడు అనుకుంటుంది)... కావాలని కార్తీక్ ను రెచ్చగొడుతుంది..కార్తీక్ నిజంగానే లాగిపెట్టి కొడతాడు..
కార్తీక్: ‘కొంచమైనా బుద్ధి ఉందా నీకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమేనా? ఈ రోజు నువ్వు పూజ చేస్తున్నావ్ కదా? ఎవరికోసం నీ భర్త కోసం అంటే నా కోసం.. ఏంటి నాకోసం కాదా?’ అంటాడు కార్తీక్ కోపంగా. ‘హా.. నీ..నీకోసమే కార్తీక్’ అంటుంది మోనిత. ‘మరి నువ్వు ఎలా అయితే నీ భర్త కోసం పూజ చేసుకోవాలని.. అడ్డులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నావో.. అలాగే వంటలక్క కూడా కోరుకుంటుంది. అంతే కదా..’ అంటాడు కార్తీక్. ‘అవును డాక్టర్ బాబు’ అంటుంది దీప. ఎదురుబొదురు ఉన్నవాళ్లం కదా అని డబ్బులు ఇస్తే సంబంధం అది ఇది అని మాట్లాడతావా? ఏం పూజకోసం ఓ పదివేలు సాయం చేయకూడదా?’ అంటాడు కార్తీక్. మోనిత: ‘పది వేలు కార్తీక్..’ అంటుంది మోనిత ఆశ్చర్యంగా. ‘హా పదివేలే.. ఆ పదివేలతో బిల్డింగ్స్ కట్టేస్తారా? లెంపలు వేసుకో? ఇలా.. వేసుకో’ అంటూ తన చేతులతో తనే లెంపలు వేసుకునేలా చేస్తాడు కార్తీక్. మోనితా అంటూ ఎంట్రీ ఇస్తాడు దుర్గ. రావడం రావడమే.. షూస్ ఎలా ఉన్నాయి? అంటాడు. ఎలా ఉంటే నాకేంటి... 
దుర్గ: ‘అదేంటి మోనితా అలా అంటావ్.. చెప్పులు బాలేదు షూస్ కొనుక్కో అని పదివేలు ఇచ్చావ్ కదా..’ అంటూ ఇరికిస్తాడు దుర్గ. కార్తీక్:‘పూజకు పదివేలు ఇస్తే తప్పు.. షూస్‌కి నువ్వు పదివేలు ఇస్తే తప్పుకాదా.. నేను ఇచ్చింది పూజకి విలాసాలకు కాదు.. ఇచ్చేయ్.. డబ్బులు ఇచ్చెయ్.. వంటలక్క చేతికి నీ చేత్తో నువ్వే ఇవ్వు.. అన్న మాటలకు పాపం పోతుంది.. అంటూ బలవంతంగా మోనిత లాక్కున్న డబ్బుల్ని మోనిత చేతే దీపకు ఇప్పిస్తాడు కార్తీక్.
మోనిత రగిలిపోతుంది..అయిష్టంగానే ఆ డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోతుంది..
ఎపిసోడ్‌ ముగిసింది