Karthika Deepam  December 17th  Episode 1538 (కార్తీకదీపం డిసెంబరు 17ఎపిసోడ్)


దీప..కార్తీక్ కి ఫోన్ చేసి డాక్టర్ బాబు మన శౌర్య అడ్రస్ దొరికింది అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. చంద్రుడు వాళ్ళ అడ్రస్ తెలిసింది పండరికి వాళ్లింటి అడ్రస్ తెలుసు ఇద్దరం అక్కడకు వెళుతున్నాం మీరు కూడా రండి అని చెబుతుంది. కావాలని వెతికినప్పుడు ఏ ఆచూకీ దొరకలేదు..ఇప్పుడు ఇలా జరుగుతోందని బాధపడతాడు. వెంటనే ఇంద్రుడికి కాల్ చేసి నేను చెప్పినట్టు చేయి అని ఫోన్లో ఏదో చెబుతాడు. 


హిమ-ఆనందరావు
తాతయ్య...నానమ్మ కాల్ చేయలేదా అని అడుగుతుంది. అమ్మా నాన్న శౌర్య ని తీసుకుని వచ్చేస్తే బావుంటుంది కదా తాతయ్యా అంటుంది. ఏదైనా సమాచారం తెలిసిఉంటే కాల్ చేసేది కదమ్మా అని సర్దిచెబుతాడు. ఈ సారి మాత్రం అమ్మానాన్నలు రావాలి తాతయ్య...ఆ నమ్మకంతోనే ప్రోగ్రెస్ కార్డుపై మీ సంతకం తీసుకోకుండా డాడీ సంతకం కోసం ఉంచాను అంటుంది. అది చూసి ఆనందరావు బాధపడతాడు..


Also Read: అత్తారింటికి దారేది అంటూ బయలుదేరిన రిషి, వసుతో జంటగా తిరిగొస్తాడా!


దీప-కార్తీక్
డాక్టర్ బాబు వచ్చేశారా ఇదిగో ఈ ఇల్లే అని ఇంద్రుడు-చంద్రమ్మ ఉండే ఇల్లు చూపిస్తుంది దీప. ఈ ఇల్లు అమ్మబడును అనే బోర్డు కనిపిస్తుంది
పండరి: ఉదయం ఈ ఇంట్లో మనుషులున్నారు..ఇప్పుడు బోర్డు ఎలా వచ్చింది..ఇంతలో ఏమయ్యారు
దీప: మనం వస్తామని తెలిసి పాపని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు
పండరి: మనం వస్తున్నట్టు తెలియదు కదా..ఎవరైనా చెప్పారనేందుకు ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు కదా
దీప: మీకు తెలుసుకదా డాక్టర్ బాబు..
కార్తీక్: అంటే నేను ఫోన్ చేసి వెళ్లిపోమని చెప్పానంటావా
దీప: మీరు హాస్పిటల్లో ఎవరిదగ్గరైనా మాట్లాడారా..వాళ్లద్వారా ఇంద్రుడికి తెలిసిందా..
కార్తీక్: నేను హాస్పిటల్లో ఎవ్వరికీ చెప్పలేదు..కానీ వాళ్లు ఎందుకు వెళ్లిపోయారో అర్థమైంది. హాస్పిటల్ దగ్గర నువ్వు చూశావు కదా ...మళ్లీ మనం వెంటపడతాం అని వెళ్లిపోయారు
పండరి: ఏదో జరిగింది..ఉండండి ఇంటి ఓనర్ ని అడిగి వస్తాను
కార్తీక్: అవసరం లేదు పండరీ..బోర్డు పెట్టిన తర్వాత ఏం అడుగుతాం..నువ్వు ఎండలో ఎక్కసేపు ఉండకూడదు..పదండి వెళదాం అన లాక్కెళ్లిపోతాడు..
పండరి: ఎవరైనా ఏదైనా తెలుస్తుందని ఆరాటపడుతున్నారు కానీ సారేంటి ఇంత తొందరపడుతున్నారు అనుకుంటుంది...


Also Read: చారుశీల సాయం అడిగిన శౌర్య, కార్తీక్ ని అనుమానిస్తున్న దీప, తల్లడిల్లిపోతున్న సౌందర్య


చారుశీల పేషెంట్లను చూస్తుంటుంది.. అప్పుడు ఎక్కడకు వస్తుంది సౌందర్య..
సౌందర్య: నేను నా కొడుకు, కోడలి కోసం వెతుకున్నాను
చారుశీల: అయితే పోలీసుల దగ్గరకు వెళ్లండి..
సౌందర్య: నేను చెప్పేది వినండి అంటూ..యాక్సిడెంట్ గురించి చెబుతుంది.. కార్తీక్ ఫొటో చూపిస్తుంది
చారుశీల: ఆ ఫొటో చూసి షాక్ అవుతుంది..అంతలోనే తేరుకుని ఇక్కడ లేడని చెబుతుంది
సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది..
చారుశీల: ఏవండీ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నాకు మీ కొడుకు కోడలు బతికే ఉన్నారని అనిపిస్తోంది అనుకుంటుంది. కానీ ఇలా వెతకడం సరికాదు ఒకవేళ వాళ్ళు బతికే ఉంటే పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత మీ ఇంటికి వస్తారు అని ధైర్యం చెబుతుంది. సౌందర్య అక్కడి నుంచి వెళ్తూ శౌర్య పోస్టర్ ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఏం కర్మ పట్టింది శౌర్య నీకు అమ్మ నాన్న కోసం ఇన్ని పాట్లు పడుతున్నావా అని ఏడుస్తుంది. ఇది ఎవరు అతకించారని అడిగితే..ఆ పాప వచ్చి అతికించిందని చెబుతుంది చారుశీల. ఆ తర్వాత సౌందర్య ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో ఫోన్ పనిచేయదు. బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


కార్తీక్-చారుశీల: మరొకవైపు కార్తీక్ దీప తో చెప్పిన అబద్ధాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి చారుశీల వస్తుంది. ఒకసారి ఆలోచించు కార్తీక్ తప్పు చేస్తున్నావేమో...మోసం చేస్తున్నావేమో అనిపిస్తోంది. అసలు వ్యాధి కంటే మనో వ్యాధి ఎక్కువ అయిపోయిందని చారుశీల బాధ పడుతుంది. ఎన్ని రోజులని ఇలా దాచిపెడతావ్ కార్తీక్ ఈరోజు మీ అమ్మగారు హాస్పిటల్ కి వచ్చారంటూ జరిగినదంతా చెబుతుంది. కార్తీక్ బాధపడతాడు. ఎవరికోసం అయితే నిజం చెప్పకుండా దాచారో వాళ్లెవ్వరూ సంతోషంగా లేరు.. పరాయిదాన్ని నేనే ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నా...మీకెలా ఉంటుందో ఊహించగలను అంటుంది చారుశీల..


సోమవారం ఎపిసోడ్ లో
చారుశీలను కలుస్తుంది సౌందర్య...వాళ్లు ఎక్కడున్నారో..వాళ్లు మళ్లీ నాకెప్పుడు కనిపిస్తారో..అసలు చూడగలనో లేదో అని సౌందర్య బాధపడుతుంది. చాటుగా నిల్చుని తల్లిని చూసి బాధపడతాడు కార్తీక్. మరోవైపు ఇంట్లో దీప నాకేమైందని కార్తీక్ ను ప్రశ్నించడంతో కోపంగా ప్లేట్ విసిరి కొడతాడు..