కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్ ప్రోమోలో ట్విస్ట్
కార్తీక దీపం సీరియల్ బోర్ కొట్టేసింది అని బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతున్న సమయంలో ఊహించని మలుపు తిప్పి అంతకుమించి అనిపించే ఆదరణ సొంతం చేసుకున్నారు సీరియల్ టీమ్. డాక్టర్ బాబుని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన మోనిత... తనకు తండ్రి అయ్యే అర్హత ఉందో లేదో తెలుసుకునేందుకు డాక్టర్ బాబు ఇచ్చిన శాంపిల్స్ ని ల్యాబ్ నుంచి కొట్టేస్తుంది. కృతిమంగా గర్భం దాల్చి బాబుకి జన్మనిస్తుంది. అప్పటి నుంచి వీడే నీ కొడుకు అని కార్తీక్ తో, వీడే మీ మనవడు అని సౌందర్య అండ్ ఫ్యామిలీతో ఆడుకుంటోంది. ఓ దశలో డాక్టర్ బాబు ఆపరేషన్ కి వెళ్లినప్పుడు కాఫీలో ఏవో మాత్రలు కలిపిచ్చి తాగించి... ఆపరేషన్ ఫెయిల్ అయ్యేట్టు చేస్తుంది. ఆ పశ్చాత్తాపంతో కార్తీక్ తన ఆస్తి మొత్తం ఆ చనిపోయిన పేషెంట్ తాలూక కుటుంబానికి ఇచ్చేసి...డాక్టర్ వృత్తికి, కన్నవారికి దూరంగా భార్య, పిల్లలతో దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత మోనిత తన కొడుకుని కార్లో పడుకోబెట్టి బొమ్మలు కొనేందుకు వెళ్లి వచ్చేలోగా ఆ బాబుని.. కోటేష్ అనే వ్యక్తి ఎత్తుకుపోయి కన్నప్రేమకు దూరమైన తన భార్య శ్రీవల్లి చేతిలో పెడతాడు. ఈ శ్రీవల్లి ఎవరంటే..కార్తీక్-దీప ఇప్పుడు ఉంటోన్న ఇంటి యజమాని. దీంతో ఇక్కడి వరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క అన్నట్టు టర్న్ అయింది సీరియల్.
Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
తన కొడుకు దొరికే వరకూ ఇక్కడే ఉంటానంటూ మోనిత..సౌందర్య ఇంట్లో తిష్టవేసింది. అటు కార్తీక్-దీప లోకల్ రౌడీ రుద్రాణి చిక్కిన వలలోంచి ఎలా బయటకు రావాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మోనిత కొడుకుని ఎత్తుకుపోయి ఇంటికి చేరారు శ్రీవల్లి-కోటేష్. ఆ బాబుని దత్తత తీసుకున్నామని చెప్పడంతో కార్తీక్-దీప-పిల్లలు దగ్గరకు తీసుకుని బాగా ముద్దుచేస్తున్నారు. ఇప్పటికే బాబు ఏడ్చినప్పుడు డాక్టర్ బాబు తప్ప ఎవ్వరు ఎత్తుకున్నా ఊరుకోవడం లేదు. ఇదో ట్విస్ట్ అనుకుంటే..తాజా ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరిపోయిందంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఎందుకంటే బాబు పుట్టినప్పుడు మోనిత.. మావయ్యగారు మీ పేరు ఆనందరావు కదా..నా కొడుక్కి ఆనంద్ అని పెడుతున్నా అని చెప్పి ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు బాబుని ఎత్తుకెళ్లిన శ్రీవల్లి వాళ్లు కూడా అదే పేరు పెడదాం అనుకుంటున్నారు. అదే విషయం దీప-కార్తీక్ కి చెప్పడంతో వాళ్లిద్దరూ అవాక్యయ్యారు. తండ్రి దగ్గరకు చేరిన ఆనంద్ భవిష్యత్ ఎలా ఉంటుంది, తండ్రి కార్తీక్-పెద్దమ్మ దీప భవిష్యత్ ఎలా మార్చబోతున్నాడో చూడాలి...
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి