ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే సెటిల్ అవ్వాలని ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు, సక్సెస్ రాలేదు. అదే సమయంలో ఇలియానా.. ఓ విదేశీయుడితో డేటింగ్ చేసేది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట విడిపోయింది.
బ్రేకప్ తరువాత ఇలియానా డిప్రెషన్ కి గురైంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తరువాత మళ్లీ సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా మరోసారి ఇలియానా ప్రేమలో పడిందంటూ వార్తలు వినిపించాయి. ఆమె డేటింగ్ చేస్తుంది కూడా ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్ తో కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తుందని సమాచారం. ఇటీవల కత్రినా బర్త్ డే వేడుకలు మాల్దీవ్స్ లో జరగ్గా.. అందులో ఇలియానా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందులో సెబాస్టియన్ కూడా ఉండడంతో అందరూ ఈ డేటింగ్ వార్తలు నిజమేనని భావించారు.
తాజాగా ఈ విషయాన్ని దర్శకనిర్మాత కరణ్ జోహార్ కన్ఫర్మ్ చేశారు. ఆయన హోస్ట్ చేస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షో లేటెస్ట్ ఎపిసోడ్ కి కత్రికా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా కత్రినాను కొన్ని ప్రశ్నలు అడిగారు కరణ్ జోహార్. ఎప్పటిలానే ఫస్ట్ నైట్, సెక్స్ అంటూ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడారు కరణ్ జోహార్. ఇదే సమయంలో కత్రినా తమ్ముడు సెబాస్టియన్ లవ్ లైఫ్ ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు కరణ్.
Karan Johar Confirms Ileana D'Cruz Is Dating Katrina Kaif's Brother Sebastian: కన్ఫర్మ్ చేయట్లేదు అంటూనే మాల్దీవ్స్ ట్రిప్ కి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చినప్పుడు.. మైండ్ లో కాలిక్యులేషన్ చేసుకున్నానని.. వీరిద్దరూ(ఇలియానా, సెబాస్టియన్) నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక పార్టీలో కలుసుకున్నారని.. అప్పుడే ఇంత ఫాస్ట్ గా స్టోరీ నడిచిందా..? అనుకున్నట్లు కరణ్ తెలిపారు. ఈ కామెంట్స్ కి నవ్వేసిన కత్రినా.. కరణ్ జోహార్ పార్టీలో అందరిని గమనిస్తుంటారని చెప్పింది.
Also Read: ‘క్యాష్’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు
Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్