రోనా తర్వాత బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకునేందుకు బాలీవుడ్ నానా ఇబ్బందులు పడుతుంటే, సౌత్ సినిమాలు మాత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. ‘కాంతార’, KGF: చాప్టర్ 2, RRR, పొన్నియిన్ సెల్వన్ 1, విక్రమ్ లాంటి సౌత్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. వసూళ్ల పరంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసిన సౌత్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  


1. విక్రమ్


కమల్ హాసన్ హీరో దాదాపు రూ. 120–150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘విక్రమ్’.  అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, అద్భుత కథనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ. 410 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి  ముఖ్యమైన పాత్రలను పోషించారు.


2. బీస్ట్


పూజా హెడ్గే, విజయ్ నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘బీస్ట్’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర మొత్తం రూ. 236.90 కోట్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన కథ గూఢచారి చుట్టూ తిరుగుతుంది.


3. పొన్నియిన్ సెల్వన్ 1


ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ,  త్రిష నటించిన ‘పొన్నియిన్ సెల్వన్1’ కేవలం 32 రోజుల్లో  రూ. 500 కోట్ల మార్కును దాటింది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమా తెరెక్కింది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించబడింది. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఇప్పటికే అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.


4. KGF: చాప్టర్ 2


‘KGF: చాప్టర్2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1148 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. యష్ హీరోగా నటించిన ఈ మూవీలో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.   


5. కాంతార


IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘కాంతార’ నిలిచింది. రిషబ్ శెట్టిన నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.350.40 కోట్లు వసూలు చేసింది. 


6. సర్కారు వారి పాట


మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. పరశురామ్  తెరెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.


7. RRR


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరెక్కించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘RRR’.  ప్రపంచ స్థాయి VFXతో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు జక్కన్న. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసింది.


8. వాలిమై


అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ అనే  తమిళ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఒక IPS అధికారి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్లకు పైగా వసూలైంది.  


9. విక్రాంత్ రోనా


కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన  ఫాంటసీ డ్రామా ‘విక్రాంత్ రోనా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది.


Read Also: రూ.7 లక్షలకు కొన్న ఇల్లు ఇప్పుడు రూ.కోట్లు - ఇదీ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్