నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా రేర్ ఫీట్ ను సాధించింది. అదేంటంటే.. తొలి మూడు రోజుల్లోనే దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ సినిమా. ఇటీవల కాలంలో మరే సినిమా సాధించని ఫీట్ ఇది. 'బింబిసార' సినిమాతో తొలి మూడు రోజుల్లోనే బయ్యర్లు సేఫ్ కావడం, నిర్మాతలు ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. 


పైగా ఈ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కి సరైన హిట్టు కూడా లేదు. దర్శకుడు వశిష్టకి ఇది మొదటి సినిమా. ఈ చిత్ర నిర్మాతలు దిల్ రాజు సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజుకి సినిమా బాగా నచ్చడంతో.. తను రెగ్యులర్ గా సినిమాలిచ్చే బయ్యర్లకు 'బింబిసార'ను రీజనబుల్ రేట్లకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ల ప్రాతిపదికన అప్పగించారు. సినిమా మార్నింగ్ షో నుంచే ఊపందుకుంది. 


రెండో రోజు కాస్త డౌన్ అయినా.. మంచి వసూళ్లే రాబట్టింది. దాంతో బ్రేక్ ఈవెన్ సులువైంది. ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక్కరిగా మారి కళ్యాణ్ రామ్ సినిమాని ప్రోత్సహిస్తున్నారు. సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఫ్యానిజం చాలా హెల్ప్ అయింది. జనాలకు కంటెంట్ నచ్చడంతో సినిమాను ముందుకు తీసుకెళ్లిపోయారు. మొత్తానికి సరైన కంటెంట్ ఉంటే జనాలు థియేటర్లకు వస్తారని ఈ సినిమా నిరూపించింది. 


'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీన‌న్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ .కె ఈ సినిమాను నిర్మించారు. 


Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!


Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే