Kakuda Trailer Out: గత కొంతకాలంగా హారర్ కామెడీ చిత్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మేకర్స్, ఆ జానర్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో రీసెంట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో, తాజాగా వరుణ్ సందేశ్ లాంటి హీరోలు కూడా అదే టైప్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ‘విరాజీ’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఇలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. రితేష్ దేశ్‌ ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కాకుడా’ అనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

   


నవ్విస్తూనే భయపెడుతున్న ‘కాకుడా’ ట్రైలర్  


‘కాకుడా’ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జీ5 వేదికగా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదిత్య సర్పోదర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ వైపు నవ్విస్తూనే, మరోవైఫు భయంతో గజ గజ వణికిస్తోంది. రాజస్థాన్ లోని రథోడీ అనే ఓ ఊరు శాపం బారిన పడిందని, ఆ ఊరిలోకి ప్రతి మంగళవారం రాత్ర 7 గంటల 15 నిమిషాకు ‘కాకుడా’ అనే దయ్యం వస్తుంది. ఈ ఊరిలోని ప్రతి ఇంట్లో రెండు వైపుల తలుపులు ఉంటాయి. ఒకటి చిన్నది మరొకటి పెద్దది. ప్రతి మంగళ వారం దయ్యం వచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయాలి.


ఒకవేళ ఓపెన్ చేయకపోతే, సరిగ్గా 13 రోజుల్లో ఆ ఇంటి యజమాని చనిపోవడం ఖాయం. అలా ఓ వ్యక్తి దెయ్యానికి దొరుకుతాడు. మరో 13 రోజుల్లో చనిపోవడం ఖాయం అని భయపడతాడు. ఆయన భార్య ఇందిర(సోనాక్షి సిన్హా) మాత్రం ఏం కాదని చెప్తుంది. ఎందుకైనా మంచిదని దయ్యాలు పట్టే వ్యక్తి(రితేజ్ దేశ్ ముఖ్)ను ఊరికి పిలుస్తారు. ఇంతకీ అతడు దెయ్యాన్ని పట్టుకున్నాడా? లేదా? అనేది ఈ సినిమాలో చూపించారు. “భర్తను కాపాడుకునేందుకు దెయ్యాలు పట్టుకునే వ్యక్తితో కలిసి ఇందిర ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆమె భర్తను కాపాడుకుంటుందా? జులై 12న ప్రీమియర్స్ లో చూడండి” అంటూ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా జీ5 షేర్ చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.






‘ముంజ్యా’లా సక్సెస్ సాధించేనా?


ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించిన గత సినిమా ‘ముంజ్యా’ థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గగ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. ‘కాకుడా’ సినిమాను మాత్రం ఆయన నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Read Also: ‘విరుపాక్ష’ స్థాయిలో వరుణ్ సందేశ్ థ్రిల్లర్ మూవీ ‘విరాజీ’ - టైటిల్ రిలీజ్ వీడియో చూశారా?