అనుకున్నట్లుగానే ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ఆస్కార్ అవార్డు లభించింది. తెలుగు సినీ కీర్తి పతాకం ప్రపంచ సినీ వేదికపై నాటు స్టెప్పులు వేసింది. ఒకప్పుడు సౌత్ సినిమా పరిశ్రమను చిన్న చూపు చూసిన నార్త్ పరిశ్రమకు అందనంత ఎత్తుకు ఎదిగింది. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, ‘నాటు నాటు’ పాట రచయిత, గాయకులతో పాటు ‘RRR’ సినీ బృందానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మాట్లాడిన మాటలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
ఆస్కార్ అవార్డుల ఈవెంట్ సందర్భంగా ‘RRR’ ప్రమోషన్ కార్యక్రమాలు అమెరికాలో జోరుగా కొసాగాయి. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ అమెరికాలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా ఆలస్యంగా వెళ్లారు. దానికి కారణం ఆయన సోదరుడు నందమూరి తారకర్న మరణం. తన అంత్యక్రియలు, పెద్దకర్మ పూర్తయ్యే వరకు జూనియర్ అమెరికాకు వెళ్లలేదు. ఈ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయ్యాక అమెరికాలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు.
వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కామెంట్స్
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ తో కలిసి మాట్లాడారు. పలువురు ఆటో గ్రాఫ్ లు తీసుకున్నారు. కొంత మంది ఫ్యాన్స్ కుటుంబ సభ్యులతోనూ ఆయన వీడియో కాల్స్ లో మాట్లాడారు. అక్కడే ఉన్న ఓ అభిమాని ఎన్టీఆర్ ను డల్లాస్ కు రావాలని అడిగాడు. “డల్లాస్ కా? వామ్మో వస్తే బ్రతకనిస్తారా మీరు నన్ను” అని ఎన్టీఆర్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇంతలోనే మరో అభిమాని కలుగజేసుకుని, 150 కార్లతో మీకు ఘన స్వాగతం పలుతుతామని చెప్పాడు. దానికి ఎన్టీఆర్ ‘‘వామ్మో’’ అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా ‘ఎన్టీఆర్ 30’
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ‘ఎన్టీఆర్ 30’ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటన చేశారు మేకర్స్. నటి జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మేరకు మూవీ మేకర్స్ ఆమెను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Read Also: ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!