‘ఆర్ఆర్ఆర్‘ సినిమా తర్వాత కొరాటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ ఓ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.  బాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ NTR30 చిత్రంలో నటించబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. జాన్వీ కపూర్ గానీ, ఆమె తండ్రి బోనీ కపూర్ గానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. NTR30 చిత్రం కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  


రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాన్వీ?


బాలీవుడ్ బ్యూటీ జాన్వీ  ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. అయితే, తన తొలి తెలుగు సినిమాకు గాను ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్ ఆమె బస చేసేందుకు చిత్ర బృందంమే ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ సినిమా NTR30కు సంబంధించి ఫిబ్రవరి 24న అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నట్లు సినీ సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి. అయితే, దురదృష్ట వశాత్తు  జూ. ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల య్యింది."NTR30 ప్రారంభోత్సవం ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అయితే, NTR, కళ్యాణ్ రామ్ కుటుంబంలో జరిగిన విషాదకర ఘటన కరంగా  వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం” అని అందులో వివరించారు.   


సముద్ర గర్భంలో హై యాక్షన్ సన్నివేశాలు?


NTR30 సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం   చియాన్ విక్రమ్ (తమిళ), సైఫ్ అలీ ఖాన్ (బాలీవుడ్)తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటులను  తీసుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో హై యాక్షన్ సీన్లు పెట్టబోతున్నారట. సముద్ర గర్భంలో హెవీ డ్యూటీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇక ఈ సినిమాకు సంబంధించి "భయం అనేది వ్యాధి అయినప్పుడు ధైర్యం దానికి మాత్రమే నివారణ" అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ప్రచారం అవుతోంది. కొరటాల శివుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రంతో నిర్మాతగా మారుస్తున్నారు. తారక్ అన్నయ్య కల్యాణ్ రామ్ సహకారంతో సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం రాక్‌ స్టార్ అనిరుద్ సౌండ్‌ ట్రాక్‌లను అందిస్తున్నారు.   






Read Also: ఛీ, మరీ ఇంట్లోకి తొంగిచూస్తారా? - మీడియాపై అలియా ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు