Blood Anointment To Devara: దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’దేవర’ వచ్చేసింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. అర్థరాత్రి నుంచే థియేటర్ల దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుని భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అభిమాన హీరోకు పూల దండలు వేసి, పాలాభిషేకాలు చేశారు. డబ్బుదరువులతో డ్యాన్సులు వేస్తూ చర్చచేస్తున్నారు. ‘దేవర’ ఆడే థియేటర్లన్నీ అభిమానులో కిక్కిరిసిపోయాయి.
మేకపోతు రక్తంతో ‘దేవర’కు అభిషేకం
తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా ఎన్టీఆర్ అభిమానుల సందడి మరో లెవల్ లో ఉంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. ఎన్టీఆర్ పోస్టర్ కు వేడి వేడి మేకపోతు రక్తంతో అభిషేకం చేశారు. తెల్లవారుజామున మొదటి షోకు ముందే పెద్ద సంఖ్యలో థియేటర్ కు చేరుకున్న అభిమానులు ఎన్టీఆర్ కటౌట్స్ కు పాలాభిషేకాలు చేస్తూ, పూలమాలలు వేస్తూ డప్పులు, వాయిద్యాలతో సందడి చేశారు. కాసేపటి తర్వాత, మేకపోతును తీసుకొచ్చి, థియేటర్ లోని ‘దేవర’ పోస్టర్ ముందు బలి ఇచ్చారు. ఒక్క వేటుతో మేకపోతు తలను నరికి.. వేడి రక్తంతో ‘ఎన్టీఆర్’కు అభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఇలా కూడా ఉంటారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఆమాత్రం ఉంటుందంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
విడుదలకు ముందే ‘దేరవ’ రికార్డులు
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రెండో సినిమాగా వచ్చిన ‘దేవర’పై మొదటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో నార్త్ లోనూ సినీ అభిమానులలో క్యూరియాసిటీ పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా తెలుగు రాష్ట్రాలతో పోల్చితే నార్త్ లోనే ఎక్కువగా చేశారు. అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఎన్టీఆర్ దేవర, వర అనే రెండు పాత్రల్లో కనిపించారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తంగం అనే యువతిగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లో ప్రీ సేల్ బుకింగ్స్ లో అత్యంత ఫాస్ట్ గా మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుని అదుర్స్ అనిపించింది. అంతేకాదు, లాస్ ఏంజెల్స్ లో జరగనున్ను బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శితం కానున్న ఇండియన్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్, శృతి మరాఠీ, శినే టామ్, మురళీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు.
Read Also: దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?