Jawan Twitter Review: ‘పఠాన్‘ను మించిన ‘జవాన్‌’, షారుఖ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచేనా? ఓవర్సీస్ ఆడియెన్స్ ఏమంటున్నారంటే?

షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం ‘జవాన్‘. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌ షో పడిపోయింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఏం అంటున్నారంటే?

Continues below advertisement

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన మూవీ ‘జవాన్‘. భారీ అంచనాల నడుమ ఇవాళ(నవంబర్ 7న) విడుదల అయ్యింది. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో  మూవీ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇతంకీ వాళ్లు ఈ సినిమా గురించి ఏం అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..   

Continues below advertisement

షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్!

‘పఠాన్’ సంచలన విజయం తర్వాత ‘జవాన్’ చిత్రం రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కామన్ గానే ఈ చిత్రంపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి.  అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అద్భుత స్పందన లభిస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి అంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతలు మోగడం ఖాయం అంటున్నారు. మరికొంత మంది ఈ చిత్రం గ్లోబల్  హిట్ అని చెప్తున్నారు.  షారుఖ్ కెరీర్ లోనే ‘జవాన్’ అతిపెద్ద హిట్ గా నిలవబోతుందంటున్నారు.    

అట్లీ, నయనతార బాలీవుడ్ ఎంట్రీ అదుర్స్

ఇక ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అక్కడ కూడా దుమ్ము దులిపేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఎమోషన్స్‌,  యాక్షన్ అద్భతం అంటున్నారు.  మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ అందించాడు అంటున్నారు.  నయనతార ఎంట్రీ, విజయ్‌ సేతుపతి నటన అద్భుతంగా ఉందంటున్నారు.  షారుఖ్‌ నటన, నయనతార ఎంట్రీ అదుర్స్‌ అని కామెంట్స్ చేస్తున్నారు.  అటు దీపికా పదుకొణె క్యారెక్టర్ సైతం అద్భుతంగా ఉందంటున్నారు.    

గమనిక: ఈ అభిప్రాయం కేవలం నెటిజన్లది మాత్రమే, ఏబీపీకి ఎలాంటి సంబంధం లేదు.

Read Also: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆడియన్స్ రివ్యూ - అనుష్క కమ్‌బ్యాక్ హిట్టు, హీరోకి హ్యాట్రిక్కు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement