2023 సంవత్సరాన్ని స్టార్ హీరోలంతా అదిరిపోయే హిట్లతో మొదలు పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బ్లాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. సంక్రాంతి సందడి తర్వాత సుమారు రెండు వారాలకు కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. సినీ లవర్స్ ను మరింత అలరించబోతున్నాయి. జనవరి లాస్ట్ వీక్ లో థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ విడుదల కాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే! 1.పఠాన్‌ - జనవరి 25

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన తాజా సినిమా ‘పఠాన్’. ఈ చిత్రానికి 'వార్' లాంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్, స్పై ఫిల్మ్ గా ఈ సినిమా రూపొందింది. ఇందులో షారుఖ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

2.హంట్‌ - జనవరి 26

టాలీవుడ్‌ యంగ్ హీరో  సుధీర్‌బాబు మెయిన్ రోల్ లో, మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ‘హంట్’.  భరత్‌ నివాస్‌, శ్రీకాంత్‌  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 26న థియేటర్లలోకి రాబోతోంది.

3.గాంధీ.. గాడ్సే.. ఏక్‌ యుధ్‌ - జనవరి 264.సిందూరం - జనవరి 265.Who Am I - జనవరి 27

ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఆహా1.18 పేజెస్‌ - జనవరి 27

23 డిసెంబర్ 2022న విడుదలైన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరిమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా చేశారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

హాట్‌ స్టార్‌1.ఎక్స్‌ట్రార్డినరీ (వెబ్‌సిరీస్‌) - జనవరి 252.డియర్‌ ఇష్క్‌(హిందీ) - జనవరి 263.సాటర్‌ డే నైట్‌ (మలయాళం) - జనవరి 27

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో1.ఎంగ్గా హాస్టల్‌ (తమిళ్‌) - జనవరి 272.షాట్‌గన్‌ వెడ్డింగ్‌ (హాలీవుడ్‌)- జనవరి 273.యాక్షన్‌ హీరో (హిందీ) - జనవరి 27

జీ51.అయలీ (తెలుగు/తమిళ సిరీస్‌) - జనవరి 262.జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ (హిందీ,తెలుగు, తమిళ్‌) - జనవరి 26

నెట్‌ ఫ్లిక్స్‌1.నార్విక్‌(హాలీవుడ్‌) - జనవరి 232.బ్లాక్‌ సన్‌షైన్‌ బేబీ(డాక్యుమెంటరీ) - జనవరి 24

Read Also: ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, త్వరలో ప్రేక్షకుల ముందుకు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘వేద’