ఇప్పటి నుంచి డబ్బులు కూడబెట్టుకోవాలని రామా, జానకి అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఈ సమస్యని పరిష్కరించాలని అంటారు. డాక్టర్ ఏమన్నారని జెస్సి అడుగుతుంది. ఏమి లేదు అంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పారులే అని జానకి చెప్తుంది. మల్లిక కూర్చుని తింటూ ఉంటుంది. అప్పుడే జ్ఞానంబ, గోవిందరాజులు రావడం చూసి లేచి నిలబడుతుంది. అప్పుడే జ్ఞానంబ చికితను పిలిచి పరీక్షలు అయ్యేంత వరకి జానకిని ఏ పనులు చేయనివ్వకు అని చెప్తుంది. ఏదైనా జ్యూస్ తీసుకుని వెళ్ళి జానకికి ఇవ్వమని చెప్తుంది. జానకి అమ్మగారు ఇంట్లో లేదని చికిత చెప్తుంది. ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తుంది. చదువుకోకుండా ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్ళిందని అంటుంది. ఇక మల్లిక ఎక్కించేందుకు చూస్తుంది.


Also Read: లాస్యని ఆఫీసు నుంచి గెంటేసిన సామ్రాట్- తులసికి మళ్ళీ పట్టాభిషేకం, అపార్థం చేసుకున్న అనసూయ


అప్పుడే జెస్సిని తీసుకుని జానకి ఇంట్లోకి వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లొచ్చిన విషయం ఇంట్లో చెప్పకు కంగారు పడతారు అని జానకి జెస్సికి చెప్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ జానకి అత్తయ్యగారు నీ చదువు పాడవుతుందని ఎంత భయపడుతున్నారని అంటుంది. టీచర్ ఇంటికి వచ్చి పుస్తకాలు ఇచ్చి చదువుకోమని చెప్తే బయటకి ఎందుకు వెళ్ళావ్ అని అడుగుతుంది. నోట్స్ కొన్ని అవసరం అయితే జెస్సిని తీసుకుని బయటకి వెళ్ళినట్టు అబద్ధం చెప్తుంది. మరి నోట్స్ ఏవి అని మల్లిక అడుగుతుంది. కొట్టు మూసేసి ఉందని జానకి చెప్తుంది. అప్పుడే ఊరి వాళ్ళు దసరా మామూలు కోసం ఇంటికి వస్తారు. జానకి చేతుల మీద డబ్బులు ఇవ్వమని జ్ఞానంబ తనకి ఇస్తుంది.


రామా షాపుకి వచ్చిన ఆదాయం తీసుకొచ్చి తల్లికి ఇస్తాడు. పెళ్లి అయిన కూడా సొంతానికి రూపాయి కూడా వాడుకోకుండా డబ్బు తెచ్చి అమ్మకి ఇస్తావ్ అని గోవిందరాజులు అంటాడు. మన ఇంటికి ఇద్దరూ వారసులు రాబోతున్నారు కదా వాళ్ళ పేరు మీద కొంత డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ చేస్తే బాగుంటుందని జానకి చెప్పారని రామా చెప్తాడు. ఆ డబ్బు మళ్ళీ జ్ఞానంబ రామా చేతికి ఇచ్చి రేపు బ్యాంక్ లో వేయమని చెప్తుంది. సంతోషంగా ఈ విషయం చెప్పడానికి రామా జానకిని పిలుస్తాడు. ఈనెల కొట్టు సంపాదన బ్యాంక్ లో వేసేందుకు అమ్మ ఒప్పుకున్నారు అని చెప్తాడు. డబ్బులు జానకిని బీరువాలో పెట్టమని తనకి ఇవ్వడం మల్లిక చూసి వీడియో తీస్తుంది. అత్తయ్యగారికి తెలియకుండా డబ్బులు దాస్తున్నారా అని మల్లిక ఈ విషయం విష్ణు చెవిన ఊదుతుంది.


Also read: అక్కాచెల్లెళ్ల త్యాగాల మధ్య నలిగిపోతున్న ఆదిత్య ఊహించని నిర్ణయం- ఆందోళనలో దేవుడమ్మ


విష్ణు షాపు డబ్బులు తెచ్చి తల్లికి ఇవ్వడానికి వెళ్తుంటే మల్లిక ఆపుతుంది. మీ అన్నయ్య వాళ్ళు ఇవ్వడం లేదు వాళ్ళ దగ్గరే దాచుకుంటున్నారు అని వీడియో చూపిస్తుంది. వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి తెలివిగా ప్రవర్తిస్తున్నారని ఎక్కిస్తుంది. మనకి పుట్టబోయే బిడ్డ కోసం డబ్బు దాచుకుందామని చెప్తుంది. అత్తయ్యగారు అడిగితే పుట్టబోయే బిడ్డ కోసం అని చెప్పండి ఏమి అనరులే అని డబ్బు తీసుకుంటుంది. వెన్నెల సంతోషంగా జానకి దగ్గరకి వచ్చి పరీక్షల్లో పాస్ అయినట్టు చెప్తుంది. రామా, జానకి బ్యాంక్ కి వెళ్తు విష్ణుని కూడా అడుగుతారు. అమ్మ డబ్బుల గురించి ఏమి చెప్పలేదా అని అడిగితే లేదని అంటాడు. ఆ డబ్బు ఇస్తే తీసుకెళ్ళి అని జానకి అంటుంటే మల్లిక మాత్రం అరుస్తుంది. మీ డబ్బులు దాచుకుంటున్నారని గొడవ చేస్తుంది.