అఖిల్‌కి జానకి ఎదురుపడుతుంది. ‘అసలు ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు, నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఒకటి కుటుంబం అయితే మరొకటి జెస్సి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఒక్కరోజు కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉంటేనే కన్నతల్లి తట్టుకోలేకపోయింది. అలాంటిది నీ వల్ల ఇంకొకరు కోమాలో ఉన్నారు, తనకి ఏం కాకూడదని దేవుడిని కోరుకో’ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మల్లిక తింటూ తెగ డాన్స్ వేస్తుంది. అది గోవిందరాజులు, జ్ఞానంబ చూస్తారు. వాళ్ళని చూసి మల్లిక గుటకలు వేస్తుంది. ఏం చేస్తున్నావ్ మల్లిక అని జ్ఞానంబ అడుగుతుంది. తల్లి ఉత్సాహంగా ఉంటే కడుపులో బిడ్డ బాగుంటుంది కదా అని పాట పాడుకుంటున్నా అని చెప్తుంది.
కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయా అని జ్ఞానంబ మల్లికని అడుగుతుంది. చాలా బాగా అని నవ్వుతూ చెప్తుంటే జానకి వస్తుంది. వంట ఏం చెయ్యమంటారు అని అడుగుతుంది. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంటి పనులు, వంట పనులు చేయవద్దని చెప్పాను కదా మరి నీకు ఈ పనులు. ఈరోజు కూడా కాలేజీకి ఎందుకు వెళ్లలేదు అని జ్ఞానంబ అడుగుతుంది. వెళ్లాల్సిన అవసరం లేదని జానకి చెప్తుంది. ఎందుకు అవసరం లేదని జ్ఞానంబ రెట్టించి అడుగుతుంది. రామా కంగారుగా వచ్చి కాలేజీకి మూడు నాలుగురోజులు సెలవు అందుకే వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తాడు. రామా చెప్పొద్దు అని సైగ చేయడం గోవిందరాజులు చూస్తాడు. కాలేజీ గురించి అడిగితే రామా ఏదో దాస్తున్నారు అని అనుమానిస్తాడు.
Also Read: ఇంటికి వచ్చేసిన నందు- ఆత్మహత్యకి సిద్ధపడ్డ అనసూయ
రామా జానకితో మాట్లాడటానికి రమ్మంటాడు. 'నేను తప్పు చేశాను అది నాకు తెలిసింది, తమ్ముడిని కాపాడుకోవాలనే ఆరాటంలో కుటుంబం కావాలో చదువు కావాలో తేల్చుకోమని అనేశాను. కానీ నేను అన్న మాటలు అప్పుడు అర్థం కాలేదు. నిన్న మీరు చెప్పాక కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. మీరు నన్ను క్షమించండి, నా మాట నేను వెనక్కి తీసుకుంటాను మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి' అని బతిమలాడతాడు. ఎంత చెప్పినా కూడా జానకి వినదు. 'తమ్ముడి మీద ప్రేమతో అన్నానే కానీ మీ మీద ద్వేషంతో కాదు అర్థం చేసుకోండి, ఐపీఎస్ అనేది ఉద్యోగం కాదు మీ నాన్న గారి కల. నేను వేసుకోలేని పోలీస్ డ్రెస్ నా భార్య వేసుకుంటుందని చాలా సంతోషపడ్డాను, దయచేసి ఒప్పుకోండి' అని బతిమలాడతాడు.
కానీ జానకి మాత్రం అది వినిపించుకోదు. ‘పెళ్లి కోసం చదువు వదులుకునే ఆడది పిల్లల కోసం చదువు, ఉద్యోగం కూడా వదులుకుంటుంది. నాకిప్పుడు అదే క్లారిటీ వచ్చింది, మీరు నాకు క్షమాపణ చెప్పడం కాదు థాంక్స్ చెప్పాలి. ఐపీఎస్ అంటే జానకి కల అనుకోకండి.. జానకి కలగనలేదు అని అనుకోండి’ అనేసి జానకి వెళ్ళిపోతుంది. గోవిందరాజులు జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయం జ్ఞానంబతో కూడా చెప్తాడు. ‘జానకి నవ్వులో జీవం లేదు, లోలోపల బాధ పెట్టుకుని పైకి నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో కంటే ఇంటి బాధ్యతలు ఎక్కువగా తీసుకుంది. అఖిల్ విషయంలో మనం బాధపడకూడదు అని అలా ఉంటుందా లేదంటే ఇంకేదైనా మనసులో బాధ ఉందని అనిపిస్తుంది’ అని గోవిందరాజులు అంటాడు. ఈ విషయం గురించి అడగటానికి జ్ఞానంబ జానకి దగ్గరకి వెళ్తుంది.
Also Read: యష్ ని నిలదీసిన వసంత్- వేద జీవితం గురించి ఆలోచించి తల్లడిల్లిన సులోచన
పైకి చెప్పుకోకపోయినా నువ్వు మనసులో దేని గురించో బాధపడుతున్నావని అనిపిస్తుంది అదేంటో చెప్పమని జ్ఞానంబ అడుగుతుంది. అదేమీ లేదని జానకి కవర్ చేస్తుంది. అఖిల్ విషయంలో నువ్వు చేసింది మేమేమి మనసులో పెట్టుకోకు దాని గురించి ఆలోచించకు అని అంటుంది. రామా మాత్రం జానకి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. చదువు విషయంలో తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోమని అడుగుతాడు. జానకి మాత్రం అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అదంతా మల్లిక చూసి వెనక్కి తీసుకొని ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుని తనకి అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది. రామా మాత్రం జానకి వెంట పడుతూనే ఉంటాడు. మీ జీవితాశయం నాకోసం వదులుకుంటే నాకు చాలా బాధగా ఉందని రామా అంటుంటాడు. మల్లిక వాళ్ళ గది బయట నిలబడి అవన్నీ చాటుగా వింటుంది.
భర్త, కుటుంబం కోసం ఐపీఎస్ అవ్వాలనే కోరిక వదిలేసుకున్నా అని జానకి రామాతో చెప్పడం విని మల్లిక షాక్ అవుతుంది. తర్వాత చదువు వదిలేసుకున్నందుకు తెగ సంతోషపడుతుంది. ‘మీరేమి తప్పు చెయ్యలేదు, నాకేమీ అనియం జరగలేదు, నేను అనుకున్న ఆశయానికి న్యాయం చేయలేనని వదిలేసుకున్నా. జానకి అంటే ఐపీఎస్ ఆఫీసర్ కాదు రామాగారి భార్య నాకు అది చాలు’ అని జానకి చెప్తుంది.