రామ, జానకి సరదాగా ఉండటం చూసి భవానీ మురిసిపోతుంది. ఇద్దరూ కలిసి భవానీకి అన్నం తినిపిస్తారు. మీ ఇద్దరితో దేవుడికి నైవేద్యం పెట్టిస్తాను విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. రామ వాళ్ళు ఉన్నారో ఏంటోనని జ్ఞానంబ దిగులు పడుతుంది. వాళ్ళు ఎప్పుడు అమ్మానాన్న అవుతారోనని బాధపడుతుంది. పిల్లలంటే రామకి చాలా ఇష్టం కానీ వాడికి ఇంకా ఆ అదృష్టం కలగలేదని అంటుంది. ఈ ప్రపంచంలో రామ, నువ్వు మాత్రమే ఉన్నారా అని గోవిందరాజులు అడుగుతాడు. జానకికి కూడా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది కదా? మరి ఎందుకు తనని బాధపెట్టేలా మాట్లాడతావు. రామని కేసు నుంచి విడిపించే విషయంలో కూడా జానకిని ఇబ్బంది పెట్టావ్ మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నావ్ అలాగే ఒత్తిడి తీసుకొస్తున్నావని గడ్డి పెడతాడు.


Also Read: ఢీ అంటే ఢీ అంటున్న ముకుంద, మురారీ- రోజురోజుకీ భర్తకి మరింత దగ్గరవుతున్న కృష్ణ


పూజలో కూర్చుంటే సంతానం కలుగుతుందని కదా అక్కడికి పంపించావని అడుగుతాడు. ఆ మాటలు చాటుగా మల్లిక వింటుంది. ఈ రాత్రికి రామ వాళ్ళు గుడిలో నిద్ర చేస్తారు. తోడికోడళ్ల ముందు జానకి బాధతో తలదించుకోకూడదని తన ఆశ అంటుంది. భవానీ రామ వాళ్ళకి పెరట్లో నిద్రపోవడానికి ఏర్పాటు చేస్తుంది. కొంచెం కూడా మర్యాద లేకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటని అనుకుంటాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళేసరికి శోభనానికి ఏర్పాటు చేసినట్టు అంతా రెడీ చేసి పెడుతుంది భవానీ. అది చూసి రామ వాళ్ళు నవ్వుకుంటారు. వెన్నెల్లో ఆరుబయట చల్లగాలిలో పడుకుని ఇద్దరూ రొమాన్స్ మొదలుపెట్టేస్తారు. కాసేపటికి జానకి తుమ్ముతూ జలుబు చేస్తుంది తన వల్ల కాదని వెళ్ళిపోతుంది.


Also Read: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?


విష్ణు మీద మల్లిక అరుస్తుంది. నేను కడుపుతో ఉంటే మీ పెద్దవాళ్ళకి సరిపోదా? మన ముందు సంతోషంగా ఉన్న పెద్ద కోడలు కడుపుతో లేదని బాధపడుతున్నారు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఊర్లో తనతో పూజలు చేయిస్తున్నారని ఏడుస్తుంది. అందులో తప్పు ఏముంది అమ్మ అని పిలిపించుకోవాలని వదినకి కూడా ఉంటుంది. నేను కడుపుతో ఉన్నంత వరకు జానకి కడుపుతో ఉండటానికి వీల్లేదని అంటుంది. నువ్వు మాత్రమే సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదని తనకి గడ్డి పెట్టేసి వెళ్ళిపోతాడు. జానకి వెళ్లి భవానీని తీసుకొస్తుంది. పెళ్ళాన్ని లోపలికిపంపించి మంచం మీద ఒక్కడివే దొర్లాలని అనుకుంటున్నావా అని నాలుగు చీవాట్లు పెడుతుంది. జానకి కావాలని రామ మీద సరదాగా చాడీలు చెప్తుంది. భవానీ రామని తిట్టి జానకిని తన దగ్గరకి పంపిస్తుంది. పొద్దునే జ్ఞానంబ నిద్రలేచి ఫోటో పట్టుకుని బాధపడుతుంది.