ఐపీఎస్ రిజల్ట్స్ కోసం జ్ఞానంబ కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది. జానకి పరీక్షల్లో పాస్ అవ్వకూడదని మల్లిక మనసులో కోరుకుంటుంది. జానకి టెన్షన్ పడుతుంటే జిల్లాలోనే అందరి కంటే మంచి మార్కులు వస్తాయని రామ నచ్చజెప్తాడు. అప్పుడే కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పింది విని జానకి షాక్ అవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని జానకి చెప్పేసరికి రామ జోక్ గా అనుకుంటాడు. కానీ నిజంగానే ఫెయిల్ అయ్యానని జానకి ఏడుస్తూ చెప్తుంది. అది నిజం కాదని రామ ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తాడు. తను ఛాన్స్ మిస్ చేసుకుంది ఫెయిల్ అయ్యిందని ప్రిన్సిపల్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. అఖిల్, మల్లిక లోలోపల సంబరపడతారు. ఐపీఎస్ ప్రిపేర్ అవ్వాలంటే అటు చదువు, కుటుంబం రెండు ఉండటం కరెక్ట్ కాదని చెప్పాను కానీ వినలేదు, కానీ సారి.. తను ఫెయిల్ అయ్యిందని చెప్పడానికి బాధ్యత గానే ఉందని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది.
Aslo Read: భార్యభర్తలుగా రిషిధార కొత్త ప్రయాణం ఎటువైపు- ప్రేమ జ్ఞాపకాల్లో తేలిపోతున్న వసు
ఇంత కష్టపడితే ఇలా జరిగిందేంటని రామ బాధపడతాడు. జానకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మల్లిక తన గదిలోకి వచ్చి నవ్వుతూ డాన్స్ వేస్తూ సంబరాలు చేసుకుంటుంది. ఆనందం పట్టలేకపోతున్నా అని సంబరపడుతుంది. జానకి రామ చెప్పిన మాటలు తండ్రి కల గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. పాతికేళ్లు కన్న కల ఎప్పుడెప్పుడు నెరవేర్చుకుంటానా అని ఎదురుచూశాను. ఎందుకు సరిగా పరీక్షలు రాయలేకపోయాను ఎందుకు ఫెయిల్ అయ్యానని జానకి ఏడుస్తుంది. ఈ చేత్తోనే కదా తలరాత రాసుకోలేకపోయానని తన చేతిని గోడకేసి కొట్టుకుంటుంది. తన జీవితం నాశనం అయిపోయిందని తనే నాశనం చేసుకున్నానని జానకి ఏడుస్తుంటే రామ వస్తాడు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నా, ఇక జీవితంలో ఐపీఎస్ పరీక్షలు రాయలేను అని బాధపడుతుంది.
ఇందులో మీ తప్పేమీ లేదు ఇంటి పరిస్థితులు. పరీక్షలు రాసే టైమ్ కి అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి డాక్టర్లు చుట్టూ తిరిగారు. అమ్మని బతికించుకోవడం కోసం మీ కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా గురించి బాధపడుతూ పరీక్షలు బాగా రాయలేకపోయారు. ఇందులో మీ తప్పేమీ లేదని నచ్చజేపుతాడు. ఆ మాటలన్నీ జ్ఞానంబ వింటుంది. జెస్సి బాధగా కూర్చుని ఉంటే అఖిల్ వచ్చి ఏమైందని అంటాడు. అక్కని అలా చూస్తుంటే బాధగా ఉందని అంటుంది. ఇంట్లో నేనే పనికిరానివాడిని అన్నారు భలే చదువుతుంది అన్నారు మరి ఇప్పుడు ఏమైందని అఖిల్ దెప్పిపొడుస్తాడు. వదిన గురించి బాధపడింది చాలు నీ గురించి నువ్వు చూసుకో లేదంటే ఇలాగే అవుతుందని అంటాడు. అటు జ్ఞానంబ రామ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గోవిందరాజులు వచ్చి జానకితో మాట్లాడావా అని అడుగుతాడు.
Also Read: భ్రమరాంబిక స్కెచ్, మాళవిక ఔట్- ఆగిపోయిన వసంత్, చిత్రల పెళ్లి
కల కోసం కష్టపడుతూ వచ్చింది కానీ ఈరోజు ట్అని పరీక్షల్లో తప్పింది అంటే ఏం అర్థం కావడం లేదని జ్ఞానంబ అంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కాసేపు జానకి చదువు గురించి తన పడిన కష్టం గురించి మాట్లాడుకుంటారు.