జానకి అందాన్ని చూసి తన దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని రామా అనుకుంటాడు. కానీ జానకి మాత్రం అదేమీ పట్టించుకోకుండా రామాకి మరింత దగ్గరకి వస్తుంది. అదంతా చూస్తున్న మల్లిక వాళ్ళ ఏకాంతాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న వస్తువుని కింద పడేస్తుంది. ఆ సౌండ్ కి ఇద్దరు ఉలిక్కిపడతారు. వెంటనే రామా అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. నా చదువు మీ ఇష్టాలని దూరం చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది రామాగారు అని జానకి మనసులో అనుకుంటుంది. వాళ్ళ ఏకాంతాన్ని చెడగొట్టానని మల్లిక తెగ సంబరపడిపోతుంది. అర్జెంట్ గా పిల్లల్ని కనేయాలని అనుకుంటూ గదిలోకి వచ్చి అరటి కాయలు తింటూ తెగ ఆనందపడుతుంది. ఏమైందని మల్లికని విష్ణు అడుగుతాడు. జానకి, మీ అన్నయ్యల ఏకాంతాన్ని చెడగొట్టానని చెప్తూ డాన్స్ చేస్తుంది. మనం నాశనం అయిపోయిన పరవాలేదు కానీ ఎదుటి వాళ్ళు బాగుపడకూడదని అంటుంది.


మనకంటే ముందు వాళ్ళకి పిల్లలు పుట్టారంటే 5 సెంట్లు వాళ్ళకి పోతుంది. లోకంలో మనం బాటకాలంటే కాస్త కుట్ర, కాస్త నటన, కాస్త మోసం ఉండాలని అంటుంది. మరేమో.. మరేమో.. అని తెగ సిగ్గుపడిపోతుంది. అది చూసి విష్ణు నువ్వు సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది, నీ సిగ్గుకి కారణం ఎంటో చెప్పమని అంటాడు. మనం పిల్లల్ని త్వరగా కనేసి ఆ 5 సెంట్లు కొట్టేద్దామండి అంటూ డాన్స్ చేస్తూ అరటి తొక్కల మీద కాలేసి జారి పడుతుంది. నా నడుము విరిగిపోయింది బాబోయ్ అని నొప్పులు పడుతుంది. అది చూసి విష్ణు సంబరంగా చూపే బంగారమాయేన.. అని పాట పాడుతూ ఎంజాయ్ చేస్తాడు.


Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్


ఇక జ్ఞానంబ దంపతులు ఏరువాక పండుగ చేసుకోవాలని ఇంట్లో అందరికీ చెప్తారు. జానకి, రామాల పెళ్లి అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఏరువాక ఏకాదశి అని చెప్పి వాళ్ళ చేతుల మీదుగా పూజ జరగాలని చెప్తారు. అందుకు జానకి వాళ్ళు సరే అంటారు. మనం అంతా కలిసి సందడిగా గడిపి చాలా రోజులైంది అందుకని ఈరోజు సాయత్రం వరకు పొలంలో ఉండి సరదాగా సంబరాలు జరుపుకోవాలని జ్ఞానంబ చెప్తుంది. ఇక అందరూ రెడీ అయి పొలానికి బయల్దేరతారు. ఇక జానకి, రామాలు బండి మీద వెళతారు. రోజు రోజు ఏదో ఒక పని పడుతుంది జానకి గారు చదువుకోడానికి సమయమే దొరకడం లేదని మనసులో అనుకుంటాడు.


అందరూ పొలానికి చేరుకుని పూజ చేసుకుంటారు. ఇక పూజ పూర్తైన తర్వాత మగవాళ్ళు పలుగు, పారా తీసుకుని పాదులు చేస్తే ఆడవాళ్ళు విత్తనాలు వేయాలి. ఈ విత్తనాలు నాటేటప్పుడు ఎలాంటి ఆటంకం జరిగిన పంట చేతికి రావడానికి కూడా ఆటంకాలు జరుగుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని కుటుంబానికి చెప్తుంది. పోలేరమ్మ చెప్పిన దాంట్లో పవర్ ఫుల్ మ్యాటర్ ఉంది జానకిని పోలేరమ్మతి తితీతంచడానికి అది మనకి మంచి ఆయధంలాగా ఉపయోగపడుతుందని మల్లిక మనసులో అనుకుంటుంది. ఇద్దరు కోడళ్లని విత్తనాలు తీసుకోమని జ్ఞానంబ చెప్పడంతో అవి నాటేందుకు అందరూ వెళతారు. ఇక రామా, విష్ణు మట్టి తవ్వుతుంటే జానకి మల్లిక విత్తనాలు వేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానంబ తో జానకిని తిట్టించాలని మల్లిక స్కెచ్ వేస్తుంది. జానకి నాడుతుంటే తన కళ్ళకి మల్లిక అడ్డుపడుతుంది. దీంతో జానకి అక్కడే పొలంలో గుచ్చి ఉన్న గునపం మీద పడబోతుంటే రామా వచ్చి కాపాడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అమ్మో ఏదో కింద పడిపోయి విత్తనాలు పడిపోతాయని అనుకున్నా కానీ చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకోసారి ఇలా చేయకూడదని మల్లిక బాధపడుతుంది. విత్తనాలు కింద పడిపోయి ఉంటాయి ఇక పోలేరమ్మ చేతిలో జానకికి దబిడి దిబిడె అని సంబరపడుతుంది.