రామా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అప్పు చేయడంతో అందరూ తనని అపార్థం చేసుకుంటారు. చివరికి జ్ఞానంబ కూడా కొడుకుని తప్పుగా అనుకుంటుంది.
జ్ఞానంబ: నువ్వే ఇలా మారావో ఎవరైనా నిన్ను ఇలా మార్చేసారేమో కూడా అర్థం కావడం లేదు. నువ్వు అయితే మాత్రం నా రామావి కాదు అనిపిస్తుంది. అయినా నీ మీద నాకున్నది కోపం కాదు ఈ కుటుంబం ఏమవుతుందోనన్న బాధ. మూడురోజుల్లో రూ.25 లక్షలు కట్టకపోతే ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని బాధ
రామా: నువ్వు తలదించుకునే పరిస్థితి తీసుకురాను
జ్ఞానంబ: అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చి కడతావ్ ఎలా కడతావ్. చెప్పాల్సినప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఏం చెయ్యాలో నీకు తెలిసినప్పుడు ఎలా చెయ్యాలో నీకు చెప్పాలసిన అవసరం లేదు
Also Read: తులసిని కంపెనీ సీఈవో చేస్తానన్న సామ్రాట్- శ్రుతిని చంటిపాపలా చూసుకుంటున్న ప్రేమ్
రామా మీద జ్ఞానంబ కోపంగా అరవడం చూసి మల్లిక సంబరపడుతుంది. ఇదే అవకాశంగా చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. విష్ణు గదిలో దిగాలుగా ఏదో ఆలోచిస్తూ ఉండగా మల్లిక వస్తుంది. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని అంటాడు. రామా, జానకి గురించి చెడుగా చెప్తుంది. జానకి తన తెలివితో బావగారిని మార్చేసిందని అంటుంది. రూ.20లక్షలు ప్లాన్ చేసి కొట్టేసిందని రెచ్చగొడుతుంది. వేరుగా వెళ్ళిపోయి జీవితం చూసుకోకపోతే మన భవిష్యత్ ఉండదు, కలిసి ఉండాలని అనుకుంటే మన పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్తుంది. విష్ణు ఆలోచన బాగుంది అంటాడు కానీ కుటుంబం ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదని అంటాడు.
జానకి భోజనం తీసుకుని జ్ఞానంబకి ఇస్తుంది. కానీ జ్ఞానంబ జానకి మాటలు వినకుండా వెళ్ళి కిచెన్ లో గోవిందరాజులు కోసం వంట చేస్తుంది. జానకి వంట చేసింది అని చికిత చెప్పినా కూడా జ్ఞానంబ వినదు. జానకి వచ్చి భోజనం వండేశాను అని చెప్తుంది. కానీ జ్ఞానంబ మాత్రం ఈ వంట తన కోసం చేసుకుంటున్నట్టు చెప్తుంది. రామా తల్లి మాటలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా జానకి వస్తుంది. తల్లి తనని దూరం పెడుతుందని రామా విలవిల్లాడిపోతూ ఉంటాడు. జానకి సర్ది చెప్పడానికి చూస్తుంది. గోవిందరాజులు రామా మీద కోపం పెంచుకోవద్దని చెప్తాడు. కావాలని తప్పు చెయ్యలేదు వాడిని దూరం పెడుతునట్టు ప్రవర్తిస్తే ఎలా ఉంటాడు. ‘రామా మాత్రమే కాదు మిగిలిన వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. మంచితనంతో మోసపోయాడు నిజమే కానీ ఇలా చేస్తున్న అని ఒక మాట చెప్పకపోవడం మోసం కదా. భార్యకి చెప్పిన వాడు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం మోసం కదా’ అని తన ఆవేదన పంచుకుంటుంది.
Also Read: వెన్నెల రాత్రిలో ఊసులాడుకున్న రెండు మనసులు- భార్య స్థానం కోసం ఆశపడిన వేద
రామా ప్రతి విషయం నీకు చెప్పి చేసే వాడు ఈ విషయం చెప్పలేదంటే తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా అని గోవిందరాజులు సర్ది చెప్పడానికి చూస్తాడు. వాడి ఆలోచన లేని నిర్ణయం వల్ల కుటుంబం అంతా నష్టపోవాల్సి వచ్చింది కదా అని జ్ఞానంబ బాధపడుతుంది. అంతవరకు పరిస్థితి రామా రానివ్వడు అని గోవిందరాజులు ధైర్యం చెప్తాడు. జానకి ఇచ్చిన భోజనం కాకుండా తను వండుకున్న భోజనం తినడం చూసి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చేసిన అప్పు తీర్చి ఇంటిని కాపాడాలి అంటే ఒక్కటే మార్గం అందుకే స్వీటు కొట్టు తాకట్టు పెడదామని అనుకుంటునట్టు రామా జానకితో చెప్తాడు. అది విని జానకి షాక్ అవుతుంది. ఈ విషయం అత్తయ్యకి చెప్పమని అంటుంది. రామా కొట్టు కాగితాలు పట్టుకుని తల్లి దగ్గరకి వస్తాడు.