తల్లి తనాథ్ మాట్లాడటం లేదని రామా చాలా బాధపడుతూ ఉంటాడు. జానకి ఎప్పటిలాగానె ధైర్యం చెప్తుంది. వాళ్ళ మాటలు గోవిందరాజులు వింటాడు. తెల్లారితే భోగి పండుగ పాత వస్తువులే కాదు ఆలోచనలు కూడా బాధలన్నీ ఆ మంటల్లో వేసి ఎప్పటిలాగా ఆనందంగా ఉండాలని అంటుంది. రామా ఎంత చెప్పినా నవ్వకపోయేసరికి జానకి తనకి చక్కిలిగిలి పెడుతుంది. జీవితం గెలవాలంటే జానకి లాంటి భార్య కావాలి, రామాని జానకి ఎప్పుడు ఒడిపోనివ్వదు అని గోవిందరాజులు అనుకుంటాడు. జ్ఞానంబ రామా వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా వెళ్ళడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మొదటి సారి తెలిసి తెలిసి ఒక తప్పు చేస్తున్నావ్ అని గోవిందరాజులు జ్ఞానంబతో అంటాడు.
Also Read: తన తిక్క చేష్టలతో నవ్వులు పూయించిన లాస్య- మొహాన నీళ్ళు కొట్టిన రాములమ్మ
‘నీకోపంతో రాముడిని ఇంకా శపించకు, తల్లి కోసం కొడుక్కి శాపం కాకూడదు. పండగ పూట అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చావ్ కానీ అవి మనసుకి సంతోషం ఇవ్వలేవు కదా. అందుకే రేపు పండగరోజు నీ మొహంలో నవ్వు తప్ప కోపం ఉండకూడదు అని నాకు మాట ఇవ్వు కాదనకు మొదటిసారి అడుగుతున్నా’ అని అంటాడు. జ్ఞానంబ మీ ఇష్టం అని మాట ఇస్తుంది. రామా, జానకి భోగి మంటలు వేయడానికి ఏర్పాటు చేసి ఇంట్లో అందరినీ నిద్రలేపుతారు. అందరూ వచ్చిన తర్వాత జ్ఞానంబ నవ్వుతూ వస్తుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పడంతో మల్లిక బిత్తరపోతుంది. కోపాన్ని ఇంట్లో పారేసి నవ్వుతూ బయటకి వచ్చారు ఏంటి అని మల్లిక మనసులో అనుకుంటుంది.
మీ చేతులతో భోగి వెలిగించండి అని జానకి జ్ఞానంబని అడుగుతుంది. అందరూ భోగి మంట దగ్గర చలికాచుకుంటూ ఉండగా రామా చెయ్యి మంటల్లో పడబోతుంది. వెంటనే జ్ఞానంబ కొడుకుని జాగ్రత్తగా పట్టుకుని కాపాడుతుంది. తల్లి తనని పట్టుకుందని, పలకరించిందని రామా చాలా సంతోషిస్తాడు. రామా, విష్ణుకి కుంకుడు కాయ రసంతో జానకి, మల్లిక తలంటుతారు. విష్ణు తలకి నూనె వేసి మర్దన చేస్తుంటే కళ్ళు మంట మంట అని అరుస్తాడు. కుంకుడు కాయ రసం వేయకుండానే అరుస్తున్నాడని కాసేపు నవ్వుతారు. తర్వాత నిజంగానే కుంకుడు కాయతో తలంటుతుంటే కళ్ళు మంట మంట అని అరుస్తాడు. అది చూసి అందరూ నవ్వుతారు. విష్ణు పారిపోతుంటే రామా వాడిని పట్టుకో అని జ్ఞానంబ అంటుంది.
Also Read: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద
అన్నదమ్ములిద్దరూ సంతోషంగా ఒకరిమీద ఒకరు నీళ్ళు పోసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తల్లి ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని రామా తెగ మురిసిపోతాడు. అది చూసి జానకి కాసేపు ఆటపట్టిస్తుంది. తల్లి తనతో మాట్లాడిందని ఆనందపడిపోతాడు.