జ్ఞానంబ, మల్లిక గుడికి వస్తారు. అదే గుడిలో క్యాటరింగ్ పనులు చేస్తూ రామా, జానకి కూడా ఉంటారు.గుడిలో ఒకామే తన మనవడి బారసాల ఆశీర్వదించమని చెప్పి పిలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే మల్లిక ప్లాన్ చేసి నీలావతిని రప్పిస్తుంది. రామా చేసిన అప్పు వల్ల ఇల్లు, డబ్బు పోయి రోడ్డున పడ్డారని జ్ఞానంబ పరువు పోయేలా మాట్లాడుతుంది నీలావతి. అది విని అందరూ నిజమా అని గుసగుసలాడుకుంటారు. అప్పుడే సునంద గుడికి వచ్చి క్యాటరింగ్ పనులు చేస్తున్న జానకిని చూస్తుంది. ఏంటి మీ అత్త కోడలు కాబోయే పోలీసాఫీసర్ అని చెప్తుంటే నువ్వేమో ప్లేట్లు కడుగుతున్నావా అని అవమానిస్తుంది. నీలాంటి వాళ్ళ దగ్గర చేతులు చాచడం కంటే ఇలాంటి పని చేసుకోవడంలో తప్పు లేదని జానకి కౌంటర్ వేస్తుంది.


Also read: లాస్య వల్ల ప్రమాదంలో పడిన దివ్య జీవితం- కూతుర్ని తులసి కాపాడుకుంటుందా?


జ్ఞానంబ వెళ్లిపోతుంటే నీలావతి మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అదంతా విని మల్లిక తెగ సంబరపడుతుంది. జ్ఞానంబ వెళ్లిపోతుంటే సునంద ఎదురుపడుతుంది. కోడలు ఐపీఎస్ అవుతుందని చెప్పావ్, ఇప్పుడేమో వాళ్ళు క్యాటరింగ్ చేసుకుంటున్నారు అని పుల్ల పెడుతుంది. అది విని నీలావతి మళ్ళీ నోటికి పని చెప్తుంది. రామా గుడిలోపలికి వచ్చి తల్లిని చూసి షాక్ అవుతాడు. అక్కడ ఉన్న అందరూ రామాని కూడా మాటలు అంటారు. అప్పుడే ఒకామే వచ్చి జ్ఞాన ప్రసూనాంబ స్వీట్ షాపు నుంచి తెచ్చిన స్వీట్స్ తీసుకొచ్చి దరిద్రంగా ఉన్నాయని అంటుంది. అవి తమ షాపు నుంచి తెచ్చినవి కాదని రామా అంటాడు. కానీ ఆమె మాత్రం జ్ఞానంబని తిడుతుంది. వ్యాపారం బాగా సాగుతుందని ఇలా చేస్తారా అని నోటికొచ్చినట్టు తిడుతుంది.


రామా ఆ స్వీట్ బాక్స్ తీసుకుని షాపుకి వెళతాడు. అక్కడ వడ్డీ వ్యాపారి భాస్కర్ కూర్చుని ఉంటాడు. రామా కోపంగా షాపులో స్వీట్స్ టిని చూసి క్వాలిటీ లేకుండా తయారు చేస్తున్నారని అడుగుతాడు. ఇప్పుడు స్వీట్ షాపు మీది కాదు నాది అని అంటాడు. ఎన్నో ఏళ్లుగా మేము మంచిగా స్వీట్స్ చేసి పేరు సంపాదించుకున్నాం ఇప్పుడు మీరు ఇలాంటి స్వీట్స్ చేసి తన తల్లి పేరు చెడగొట్టొద్దని రామా అంటాడు. షాపు మాది అడగటానికి నువ్వు ఎవరు అని భాస్కర్ అంటాడు. రామా వాళ్ళతో గొడవపడుతూ ఉంటే జానకి వస్తుంది. స్వీట్స్ క్వాలిటీ ఇలాగే ఉంటుందంటే షాపు పేరు తీసేయండి అని రామా అంటాడు. కుదరదు షాపు పేరు తీసెయ్యను, కావాలంటే డబ్బులు తెచ్చి ఇచ్చి షాపు తీసుకో అని భాస్కర్ అంటాడు.


Also Read: మళ్ళీ మొదలైన వేద, యష్ కీచులాట- భ్రమరాంబికకి మాళవిక గురించి నిజం చెప్పిన ఖైలాష్


జానకి కూడా డబ్బులు ఇచ్చి త్వరగా షాపు విడిపించుకోవాలి గొడవ వద్దు అని సర్ది చెప్పి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. జ్ఞానంబ గుడిలో జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉండగా మల్లిక మంట పెట్టేందుకు చూస్తుంది. రామా వాళ్ళ వల్లే అలా జరిగిందని ఎక్కిస్తుంది. అప్పుడే రామా, జానకి వస్తారు. నువ్వు చేసిన తప్పుకి అమ్మకి అవమానం జరిగిందని విష్ణు కోపంగా అంటాడు. అప్పుడే జెస్సి వచ్చి వెన్నెల వస్తుందని చెప్తుంది.