నందు డల్ గా ఇంటికి రావడం చూసి అందరూ కంగారుగా ఏమైందని అడుగుతారు. మీరు వచ్చినట్టు కారు సౌండ్ కూడా వినిపించలేదని అభి అంటాడు. కారు లేదు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ కట్టలేదని రోడ్డు మీద ఆపి లాక్కుని వెళ్లిపోయారు. ఇంట్లో వాళ్ళే నన్ను నమ్మలేదు ఇంక బయట వాళ్ళు ఏం నమ్ముతారు. బాగుపడటం నాకు చేతకాదని నందు బాధగా మాట్లాడతాడు. కాలం కలిసి రానప్పుడు ఏది కలిసిరాదు అలా అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అని తులసి వేదాంతం మొదలుపెడుతుంది. నడిచి వచ్చేసరికి నందు కాళ్ళ నొప్పితో అల్లాడిపోతూ ఉంటాడు. లాస్య వచ్చి నందు కాళ్ళు నొక్కుతూ బిస్కెట్ వేసేందుకు ట్రై చేస్తుంది. ఎవడైనా మనకి లక్షన్నర అప్పు ఇచ్చే వాడు ఉన్నాడా అని అడుగుతుంది. ఆ మాటకి బిత్తరపోతాడు.


Also Read: మళ్ళీ మొదలైన వేద, యష్ కీచులాట- భ్రమరాంబికకి మాళవిక గురించి నిజం చెప్పిన ఖైలాష్


ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకని అడుగుతాడు. దివ్య ల్యాప్ టాప్ పాతది అయిపోయిందని అన్నది, తనకి కొనిద్దాం అని అంటుంది. దారిన పోయే కంప తగలించుకోవడం ఎందుకు, అప్పు తీసుకురావాలంటే నిన్ను తాకట్టు పెట్టాలి. హారతి ఇచ్చావ్ ఎదురొచ్చావ్ కారు పాయే, ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే అని నందు వెళ్ళిపోతాడు. శ్రుతికి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నట్టు తులసి కోడళ్ళతో అంటుంది. కలిసి రావాలంటే కూతుర్ని కనాలి, తెలిసి రావాలంటే కొడుకుని కనాలి అని వీర లెవల్ లో డైలాగ్ వేసేస్తుంది తులసి. అత్త క్లాస్ విని కోడళ్ళు తెగ మెచ్చుకుంటారు. లాస్య దివ్యకి తన ల్యాప్ టాప్ ఇస్తుంది. ఏదోలా కొత్త ల్యాప్ టాప్ కొనిస్తాను అప్పటి వరకు తనది వాడుకోమని చెప్తుంది. అది తీసుకుని దివ్య సంతోషిస్తుంది. పనిలో పనిగా తులసి గురించి చెడుగా చెప్తుంది. ఆ మాటలు నమ్మిన దివ్య లాస్య వలలో పడిపోతుంది.


Also Read: తులసి క్లాస్, సామ్రాట్ క్లాప్స్- దివ్యని బుట్టలో వేసుకోవడానికి వచ్చి ఇరక్కపోయిన లాస్య


దివ్య తన ఫ్రెండ్ బర్త్ డే వెళ్ళాలి కానీ మామ్ ని అడిగితే పంపించదు అని లాస్యతో చెప్తుంది. స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి వెళ్లిపో అని సలహా ఇస్తుంది. దివ్య పూర్తిగా తనవైపు తిరిగిపోయినట్టే ఛాలెంజ్ లో సగం గెలిచానని లాస్య సంబరపడిపోతుంది. కడుపుతో ఉన్న కోడలు శ్రుతితో వాకింగ్ చేయిస్తూ తన దుంప తెంచుతుంది తులసి. తొమ్మిది నెలలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో అని ఎదురుచూస్తున్న అనిఅంటుంది. దివ్య రెడీ అయ్యి తులసి దగ్గరకి వెళ్తుంది. దివ్య అలా రెడీ అవడం చూసి ఎక్కడికి బయల్దేరావ్ అని గట్టిగా అడుగుతుంది. తర్వాత ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు ముద్దుగా ఉన్నావ్ అని మెల్లగా అడిగి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. లాస్య వచ్చి కలుగజేసుకుని మాట్లాడుతుంది.