రామా సంతోషంగా ఇంటికి వస్తాడు. అఖిల్ కి ఒక విధంగా ఉద్యోగం వచ్చినట్టే, దారిలో తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడని చెప్తాడు. అఖిల్ కి ఉద్యోగం ఇస్తానని చెప్పినట్టు చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఈ కార్డు అఖిల్ కి ఇచ్చి వివరంగా చెప్పమని రామా అంటే జానకి వద్దని ఆపుతుంది. ఇప్పుడు అఖిల్ కి ఉద్యోగం గురించి చెప్తే ఖాళీగా ఉన్నా కాబట్టి చిన్నచూపుతో చెప్తున్నా అనుకుంటారని జానకి సర్ది చెప్తుంది. దీంతో సరే అని రామానే మాట్లాడటానికి వెళ్తాడు. అఖిల్ గదిలోకి వచ్చి ఫ్రస్టేట్ అవుతాడు. జెస్సి వెనుకాలే వచ్చి మల్లిక అక్క ఏదో సలహా చెప్తుంటే ఎందుకు వద్దని వచ్చావ్ అని అంటుంది. అఖిల్ కోపంగా తన మీద అరుస్తాడు.
రామా అఖిల్ ని పిలుస్తాడు. విజిటింగ్ కార్డ్ అఖిల్ కి ఇచ్చి చూడామని చెప్తాడు. అది తన స్నేహితుడిది అని ఉద్యోగం ఇస్తానన్నాడని చెప్తాడు. కానీ అఖిల్ మాత్రం రికమండేషన్ మీద జాబ్ వద్దని చెప్తాడు.
అఖిల్: రేపు వదిన నా భర్త వల్లే జాబ్ వచ్చిందని అందరి ముందు చెప్తూ ఉంటే భరించలేను
రామా: నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్ మీ వదిన గురించి తప్పుడ అర్థం చేసుకుంటున్నావ్
అఖిల్: వద్దు అన్నయ్య నాకు నేనుగానే ఉద్యోగం చూసుకుంటాను
Also Read: తులసి విలువ తెలుసుకుంటున్న నందు- బతికి అందరినీ బాధపెట్టడం ఎందుకంటున్న పరంధామయ్య
జెస్సి: అక్క నీ మంచి కోసం కదా చెప్తుంది ఆలోచించొచ్చు కదా
అఖిల్: అవును ఎంత బాగా అంటే ఆవేశంలో అరెస్ట్ చేయిస్తుంది, అందరూ తప్పు చేశాను అని చూస్తున్నారు. అది కూడా ఉద్యోగం రాకపోవడానికి ఒక కారణం అని అంటాడు. ఉద్యోగం తనని తానుగానే చూసుకుంటా అని సహాయం వద్దని చెప్తాడు. జానకి గదిలో కూర్చుని చదువుకోవడం చూసి రామా చాలా సంతోషిస్తాడు. అఖిల్ కి ఉద్యోగం గురించి చెప్పారా అని జానకి అడుగుతుంది. ఎవరి వల్లో వచ్చిన ఉద్యోగం వద్దని అఖిల్ అన్నాడని రామా చెప్తాడు. ఆ మాటకి జానకి చాలా బాధపడుతుంది. ‘నా ఆశయం కోసం మనం దూరంగా ఉంటున్నాం, ఐపీఎస్ అయిన తర్వాత పరిపూర్ణమైన ఇల్లాలిగా ఉంటాను. ఈ విషయంలో మీరు బాధపడి ఉంటే క్షమించండి’ అని జానకి మనసులో అనుకుంటుంది.
అఖిల్ మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తుంటే రామా తన స్నేహితుడి ఆఫీసు దగ్గర దింపుతాడు. అవసరమా అయితే అక్కడ తన పేరు చెప్పమని రామా అంటాడు. కానీ అఖిల్ మాత్రం రికమండేషన్ మీద జాబ్ వద్దని అంటాడు. అవసరమా అయితే అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత చరణ్ తో మాట్లాడాలని రామా అనుకుంటాడు. ఇంటర్వ్యూకి చరణ్ దగ్గరకి వెళతాడు అఖిల్.
Also Read: బాపు బొమ్మలా వేద, కన్నార్పకుండా చూస్తున్న యష్- మాలిని మీద కస్సుబుస్సులాడిన సులోచన