జెస్సీ సీమంతం వేళ రామా తన మనసులో కోరిక బయటపెడతాడు. జానకి కడుపుతో ఉంటే సీమంతం చేసినట్టు ఊహించుకుంటాడు. భర్తగా తనకి సీమంతం వేడుక ఘనంగా చేసి ఆశీర్వదించినట్టు కల కంటాడు. రామా ఏదోలా మొహం పెట్టుకుని ఉండటం చూసి జానకి ఏమైంది ఏదైనా కల కన్నారా అని అడుగుతుంది. మీకు సీమంతం చేసినట్టు ఊహించుకున్నా అని సిగ్గుపడుతూ చెప్తాడు. నాకు సీమంతం చెయ్యాలని ఆశ పడుతున్నారా అని జానకి అంటే అప్పుడే కాదు మీరు చదివి పోలీసాఫీసర్ అవ్వాలి అప్పుడు అదంతా అని రామా అంటాడు.
మల్లిక జానకి దాచిన రిపోర్ట్ కొట్టేయాలని చూస్తుంది. జానకి డాక్టర్ తో ఏం మాట్లాడింది, ఆ రిపోర్ట్స్ లో ఏముందా అని ఆలోచిస్తుంది. ముత్తైదువులు అందరూ జెస్సికి గాజులు తొడుగుతూ సీమంతం చేస్తూ ఉంటారు. మల్లిక ఎవరూ చూడకుండా జానకి గదిలోకి వచ్చి రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. మల్లిక ఫంక్షన్లో లేకపోవడం జానకి గమనిస్తుంది. ఆ రిపోర్ట్స్ గురించి మల్లికకి ఏదైనా అనుమానం వచ్చిందా అని జానకి తన గదిలోకి వెళ్ళి రిపోర్ట్స్ కోసం చూస్తుంది. కానీ అవి అక్కడ ఉండవు. వెంటనే కంగారుగా మల్లిక కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే మల్లిక ఏమి తెలియని దానిలా ఒక చోట కూర్చుని ఉంటుంది. మల్లిక రిపోర్ట్స్ తీసి అమాయకంగా నటిస్తుందని అనుకుంటుంది.
Also Read: సా.. గుతున్న తులసి హోమ్ టూర్- లాస్య తానా అంటే తందాన అంటున్న నందు
జానకి టెన్షన్ గా ఉండటం చూసి రామా ఏమైందని అడుగుతాడు. అందరూ సంతోషంగా ఉండాలంటే ఆ రిపోర్ట్స్ ఎవరు చూడకూడదని జానకి మనసులో అనుకుంటుంది. జానకి పరధ్యానంగా ఉండటం చికిత గమనించి ఎందుకు కంగారుగా ఉన్నారని అడుగుతుంది. ఏమి లేదని చెప్పి వెళ్ళిపోతుంది. జెస్సికి ఘనంగా సీమంతం జరిగింది తలుచుకుని జ్ఞానంబ సంతోషంగా ఉంటుంది. మల్లిక కడుపు పోయినందుకు చాలా దిగులు పెట్టుకున్న కానీ జెస్సి సీమంతం ఆ దిగులు తీర్చిందని భర్తతో చెప్పుకుని సంతోషంగా ఉండటం జానకి చూస్తుంది. మల్లిక కడుపు అలా అయిన తర్వాత జెస్సీ కడుపులో బిడ్డ గురించి భయం పట్టుకుంది కానీ బిడ్డ బాగుందని జానకి చెప్పిన తర్వాత ధైర్యం వచ్చిందని అంటుంది.
జెస్సిని జాగ్రత్తగా చూసుకోమని జానకికి జ్ఞానంబ చెప్తుంది. జానకి గదిలోకి వచ్చి జ్ఞానంబ మాటలు తలుచుకుని బాధపడుతుంది. జెస్సి కడుపులో బిడ్డ బతకదని తెలిస్తే ఇంట్లో ఎవరు తట్టుకోలేరని అనుకుంటుంది. రిపోర్ట్స్ కోసం గది అంతా వెతుకుతూ ఉంటుంది. మల్లిక ఆ రిపోర్ట్స్ చూస్తుంది, కానీ ఇంగ్లీషు రాక వాటిని చదవలేక బిక్క మొహం వేస్తుంది. ఇందులో ఏదో తేడా ఉందని అర్థం అయ్యింది కానీ అదేంటి అనేది ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. జానకి మల్లిక తీసిందేమో అని అనుమానంగా తన గదికి వెళ్లబోతుంది. అప్పుడే మల్లిక రిపోర్ట్స్ తీసుకుని జెస్సిని అడిగి తెలుసుకుందామని వస్తుంది. అది గమనించిన జానకి వెంటనే తనని ఆపుతుంది.
Also Read: హడలెత్తించిన భ్రమరాంబిక- మాళవికని ఇంట్లో నుంచి పంపించేయమన్న అభీ సిస్టర్