దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2023 పరీక్ష తేది ఖరారైంది. వచ్చే ఏడాది మే 7న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇక కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023 పరీక్షలను మే 21-31 మధ్య నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. కాగా జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూలు ఇప్పటికే ప్రకటించగా.. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.



Also Read:


జేఈఈ మెయిన్‌-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది. ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.


జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.


జేఈఈ మెయిన్ పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి.. 


Also Read

ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో యాజమాన్య కోటాలో తుది విడత ప్రవేశాలు, ఇదే చివరి అవకాశం!
తెలంగాణలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి తుది విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 15న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సుల్లో ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని, గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలన్న అభ్యర్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జీవోను సడలిస్తూ ఈ ఆఖరి విడత ప్రవేశాలకు అనుమతించిందని పేర్కొంది.


అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిసెంబర్ 17న కాకతీయ వర్సిటీ ప్రాంగణంలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరింది. నిబంధనలు, పూర్తి వివరాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..