పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో చెప్పమని గోవిందరాజులని జ్ఞానంబ అడుగుతుంది. రామ వచ్చేస్తున్నాడు, తను నిర్దోషి అని తెలుసు కానీ రుజువులు వ్యతిరేకంగా ఉండటం వల్ల కాస్త టైమ్ పడుతుందని అబద్ధం చెప్తాడు. నిర్దోషి అన్నప్పుడు వెంటనే విడిచి పెట్టడానికి ఏమైందని అంటుంది. కానీ ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయని సర్ది చెప్తాడు. అప్పుడే అఖిల్ వచ్చి మనవడి బారసాల ముహూర్తం పంతులతో రాయించుకుని వచ్చానని చెప్తాడు. రేపే మంచి ముహూర్తం ఉందని అంటాడు. రామ ఇంట్లో లేకుండా బాబుకి బారసాల ఏంటని జ్ఞానంబ అడుగుతుంది. పూజకి పీటల మీద కూర్చోవడానికి బాబు తల్లిదండ్రులు మేము ఉన్నాం ఆశీర్వదించడానికి మీరు ఉన్నారు ఇక వాయిదా వేయడం కుదరదని అఖిల్ చెప్తాడు. పెద్దన్నయ్య లేకుండా బారసాల చేసుకోవడం కరెక్ట్ కాదని జ్ఞానంబ అంటుంది.


Also Read: దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ జరగకుండా చేసిన రాజ్యలక్ష్మి- తులసికి నందు నిజం చెప్పేస్తాడా?


అన్నయ్య చేసిన పనికి అందరూ అడిగే వాటికి సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వస్తుందని అనేసరికి తను ఏ తప్పు చేయలేదని జానకి అంటుంది. అన్నయ్య విడుదల అవుతాడు వాడు లేకుండా బారసాల పెట్టుకుంటే బాధపడతాడని జ్ఞానంబ సర్ది చెప్తుంది. మధ్యలో మల్లిక సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. త్వరలోనే మీ అన్నయ్య వస్తాడని గ్యారెంటీ ఏంటనే కదా నీ డౌట్ అని మల్లిక పుల్ల వేస్తుంది. పెద్దన్నయ్య ఇప్పటిలో వచ్చే ప్రసక్తే లేదు రాసి పెట్టుకోండి బారసాల మాత్రం ఆపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. దీంతో జ్ఞానంబ రామ్ వస్తాడని మీరు చెప్తున్నారు కానీ ఎవరు నమ్మడం లేదు రాముడు రేపు బారసాల టైమ్ కి ఇంట్లో ఉండాలి లేదంటే ఈ జ్ఞానంబ చచ్చినట్టేనని కఠినంగా మాట్లాడుతుంది. రేపటికల్లా అంటే కష్టమేమో అంటాడు. ఇంట్లో అందరికీ స్వార్థం పెరిగిపోయిందని జ్ఞానంబ బాధపడుతుంది. చేయని తప్పుకి ఈ మహాతల్లి రామని లాక్కెళ్లి జైల్లో పడేసింది. పెంచి పెద్ద చేసిన తమ్ముళ్లకి అన్న అవసరం లేకుండా పోయింది. భార్యకి పట్టడం లేదు. అందరూ కలిసి వాడిని ఎందుకు ఒంటరిని చేస్తున్నారని ఎమోషనల్ అవుతుంది.


Also Read: స్వప్నకి వార్నింగ్ ఇచ్చిన కావ్య- భార్యని వదిలేసి రాజ్ ని ఇంట్లో అడుగుపెట్టమన్న అపర్ణ


రేపు రామని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అంటున్నారు సాక్ష్యాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటు చూడబోతే బారసాల టైమ్ కి రామ ఇంట్లో ఉండాలని అంటున్నారు ఏం చేయాలని జానకి టెన్షన్ పడుతుంది. ఎలాగైనా బారసాల వాయిదా వేయమని రిక్వెస్ట్ చేయడానికి అఖిల్ దగ్గరకి వెళ్తుంది. నా బాబు బారసాల వాయిదా వేయడం కుదరదని చెప్తాడు. బారసాల వాయిదా వేయమని అడుగుతుంది మీ అన్నయ్య కోసం కాదు అత్తయ్య కోసమని అడుగుతుంది. రేపటిలోగా మీ పెద్దన్నయ్యని బయటకి తీసుకురావడం కుదరదు, ఆయన లేకపోతే అత్తయ్యని కంట్రోల్ చేయడం చాలా కష్టమని అంటుంది. అఖిల్ బారసాల వాయిదా వేయడానికి అంగీకరించడు. జానకి అరెస్ట్ చేసిన మురళీ గురించి తన ఫ్రెండ్స్ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. లేడి కానిస్టేబుల్ కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లిందని నవ్వుతారు. దీంతో తన అంతు చూస్తానని మురళీ వెళ్ళిపోతాడు. జానకి తన దారిలోకి వస్తుందని మధుకి మనోహర్ చెప్తూ ఉండగా అప్పుడే తను క్యారేజ్ పట్టుకుని స్టేషన్ కి వస్తుంది.