పెద్దవారిగా మీరు అర్థం చేసుకుని పిల్లల పెళ్లి చేస్తారా లేదా అని జెస్సి తండ్రి పీటర్ జ్ఞానంబని నిలదీస్తాడు. గొంతు పెద్దది చేసినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు, నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు నీ కూతురితో పెళ్లి చేయడం అనేది అసలు జరగని పని జ్ఞానంబ తేల్చి చెప్పేస్తుంది. జానకి గడువు అడిగింది కదా అని గోవిందరాజులు అంటే నా నిర్ణయంలో ఏ మార్పు లేదని అంటుంది. రేపు ఈ టైమ్ కి మీ నిర్ణయం మార్చుకుని నా కూతురితో పెళ్లి జరిపిస్తారా సరి లేదంటే దాని పరిణామం ఎలా ఉంటుందో చెప్పలేను అని పీటర్ హెచ్చరించి వెళ్ళిపోతాడు. జానకి నువ్వంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నిజం నిరూపించే అవకాశం నీకు ఇచ్చాను రేపు ఇదే సమయానికి గణేష్ నిమజ్జనం ఉంటుంది అప్పటితో నీకు ఇచ్చిన గడువు కూడా ముగుస్తుంది ఈ లోగా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే ఆ అమ్మాయి పేరు వినపడకూడదు ప్రస్తావన కూడా రావడానికి వీల్లేదని జ్ఞానంబ చెప్తుంది.


Also Read: యష్ ని తన వెంట తిప్పుకుంటా అని వేదతో ఛాలెంజ్ చేసిన మాళవిక- చిత్ర, వైభవ్ ని చూసి బాధపడుతున్న వసంత్


రేపటి వరకి మనం జాగ్రత్తగా ఉంటే చాలు మా అమ్మ మాట ఎవరు జవదాటరు అని అఖిల్ మనసులో అనుకుంటాడు. నిమజ్జనం లోపు నేను నిజం చెప్పించలేకపోతే నేను అత్తయ్యగారి ముందు దోషిలా నిలబడాలి ఎలాగైనా అఖిల్ తో నిజం చెప్పించాలి అని జానకి అనుకుంటుంది. జ్ఞానంబ ఇంటి దగ్గర నిమజ్జనం సందడి మొదలవుతుంది. జానకి, రామా  అఖిల్, జెస్సిలకి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తారు. అది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పోలేరమ్మకి చెప్పాలి అని మల్లికా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిమ్మల్ని మోసం చేసి మీ మాట జవదాటి బావగారు జానకి జెస్సితో అఖిల్ కి బలవంతంగా పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చారు అని చెప్తుంది. అది విని జ్ఞానంబ షాక్ అవుతుంది.


మిగిలిన నాలుగు అంకెలు కూడా కొట్టేయండి అత్తయ్యగారు అని మల్లిక అంటుంది. జ్ఞానంబ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఎర్ర నీళ్ళు తీసుకుని వస్తుంది చికిత. అదేంటి చికిత అట్ల కాడ కాల్చి తీసుకుని రా వీళ్లందరికి కాల్చి వాతలు పెట్టాలి అని మల్లిక వాగుతుంది. కానీ జ్ఞానంబ మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటారు ఏంటి అని మల్లిక అనేసరికి కొత్త జంటకి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని రా అని జానకికి చెప్తుంది. అదేంటి అని మల్లిక షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు గెట్ అవుట్ జీవితంలో మీ మొహం చూపించకండి అని అరవడం మర్చిపోయి లోపలికి పంపిస్తున్నారు ఏంటి అని మల్లిక అడుగుతుంది. నాకు అంతా తెలిసే చేస్తున్నా అని జ్ఞానంబ చెప్తుంది.


Also Read: రాధతో ఏడడుగులు వేసిన మాధవ్ - ఆదిత్యే రాధ భర్త అని తెలుసుకున్న జానకి


గత రాత్రి ఏం జరిగిందో జ్ఞానంబ గుర్తు చేసుకుంటుంది. జానకి అఖిల్ దగ్గరకి వెళ్తుంది. అఖిల్ ఒక ఆడపిల్ల లైఫ్ బాగుపడటానికి కొన్ని గంటలు మాత్రమే ఉందని జానకి అంటుంది. ఆ టైమ్ గడిచిపోతే ఇంక నాకు ప్రాబ్లం లేనట్టే కదా వదిన అని అఖిల్ సమాధానం చెప్తాడు. నువ్వు చేస్తున్న తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితమే కాదు ఇంటి పరువు కూడా పోతుందని జానకి అంటుంది. నీ వల్ల కడుపుతో ఉన్న జెస్సి నీ వల్ల మోసపోయినందుకు ఎంత కుమిలిపోతుందో తెలుసా పద అఖిల్ అమ్మ ముందు నిజం ఒప్పుకో నీకు ఏమి అవకుండా నేను చూసుకుంటాను అని జానకి చెప్తుంది. సోరి వదిన ఆ టైమ్ దాటిపోయింది, అమ్మ నన్ను నమ్ముతుంది కాబట్టి ఇంకెప్పటికి ఈ నిజం తెలిసే అవకాశం లేదు వదిన అనడం జ్ఞానంబ వింటుంది. ఎందుకు అఖిల్ ఇలా బిహేవ్ చేస్తున్నావ్ ప్రేమ తప్ప ద్వేషం తెలియని తల్లి నీడలో పెరిగావ్, ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు, నేను నిన్ను మరిదిలా చూడలేదు బిడ్డలాగా అనుకున్నా, నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులు కవర్ చేశాను అని జానకి అంటుంది.


తరువాయి భాగంలో..


జ్ఞానంబ కోపంగా అఖిల్ చెంపలు పగలకొడుతుంది. అఖిల్ అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు నమ్మకం కూడా నిన్ను నమ్మి రామాని జానకిని కూడా బాధపెట్టాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గుడు కాదు నా కొడుకు అని భ్రమలో ఉన్నాను అని జ్ఞానంబ ఎమోషనల్ అవుతుంది.