నీ మీద ఇంటి బాధ్యతలు పెట్టాను అవి జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ చదువు మీద దృష్టి పెట్టు, ఆ అమ్మాయి ఏం ఆశించి అఖిల్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో బుద్ధి చెప్పి తనని పంపించమని జ్ఞానంబ జానకికి చెప్తుంది. అత్తయ్యగారు అబద్ధం అవసరాన్ని బట్టి పై చెయ్యి అవుతుందేమో కానీ నిజం నిలకడ మీద నిజాయితిని నిరూపిస్తుంది. తను కడుపుతో ఉంది, ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం జీవితాంతం ఆ నింద మోయాలి. జెస్సిని నాలుగు రోజులు మన ఇంట్లో ఉండనిద్దాం అందుకు అఖిల్ కారణమో కాదో నేను నిరూపిస్తాను అని జానకి అడుగుతుంది. జెస్సిని ఇంట్లో ఉంచుకుంటే వదిన ఏదో ఒకరోజు నిజం నిరూపిస్తుంది, అప్పుడు తనని వదిలించుకోవడం కష్టం అవుతుంది అని అఖిల్ మనసులో అనుకుంటాడు. జానకి అంత గట్టిగా చెప్తుంది అంటే మనం తేలికగా కొట్టి పారెయ్యడం ఎందుకు, ఆ అమ్మాయి జీవితం మన వల్ల నాశనం కాకూడదు కదా నాలుగు రోజులు ఉండనివ్వు అని గోవిందరాజులు కూడా చెప్తాడు.


నువ్వు అడిగిన నాలుగు రోజులు నీకు ఇస్తాను నువ్వు నిరూపించాలి, నిరూపిస్తే నేను వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాను కానీ ఆ అమ్మాయి మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని జ్ఞానంబ తేల్చి చెప్తుంది. ఏం కాదులే కంగారు పడకండి అని రామా ధైర్యం చెప్తాడు. అఖిల్ మాట మార్చాడు, ఇప్పుడు జెస్సి పరిస్థితి ఏంటి, తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, అఖిల్ తో పెళ్ళికి ఒప్పించి జెస్సిని తీసుకుని వస్తాను అని వాళ్ళ అమ్మానాన్నకి మాట ఇచ్చాను ఇప్పుడు ఎలా చెప్పండి అని జానకి బాధ పడుతుంది. ఇద్దరం కలిసి జెస్సిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి అమ్మానాన్నతో మనం మాట్లాడదాం అని రామా చెప్పడంతో జానకి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.


Also Read: సామ్రాట్ ముందే నందుని అవమానించిన అనసూయ- పండగ సంబరాల్లో గొడవపడిన ప్రేమ్, శ్రుతి


మీ అత్తయ్యగారితో మాట్లాడావా నేను ప్రగ్నెంట్ అని చెప్పావా మా ప్రేమ గురించి చెప్పావా పెళ్ళికి ఒప్పుకున్నారా అక్కా అని జెస్సి టెన్షన్ గా అడుగుతుంది. ఇవి తేలడానికి కొంచెం టైమ్ పడుతుంది ప్రస్తుతం మీ ఇంటికి వెళ్దామని రామా అంటాడు. అఖిల్ తో పెళ్లి ఫిక్స్ కాకుండా ఇంటికి వెళ్తే మా నాన్నగారు ఊరుకోరు చంపేస్తారు. మా ఇంట్లో వాళ్ళు నన్ను బతకనివ్వరు అని జెస్సి బాధపడుతుంటే జానకి, రామా ధైర్యం చెప్పి తీసుకుని వెళతారు. జ్ఞానంబగారు ఒప్పుకోలేదని అర్థం అయ్యింది మేము ఏం చెయ్యాలో అది చేస్తాం అని జెస్సి తండ్రి అంటాడు. వెయిట్ చెయ్యడానికి వీలు ప్రేమతో ఆగలేదు తలనొప్పి తెచ్చి పెట్టారు, ఫైనల్ గా నేను వచ్చి మీ అత్తయ్యగారితో మాట్లాడతాను అప్పటికి ఒప్పుకోకపోతే పోలీసుల సమక్షంలో వీళ్ళ పెళ్లి చేస్తాను అని జెస్సి తండ్రి అంటాడు.


మీ ఆవేదనలో అర్థం ఉందని రామా అంటాడు. మీ స్థానంలో నేను ఉన్నా ఇలాగే ఆవేశపడతాను కానీ నా మాట కొంచెం వినండి. జరిగింది అంతా మా అమ్మకి జానకి గారు చెప్పారు. జెస్సి కడుపుతో ఉందని పది మందికి తెలియక ముందే మా అమ్మని ఒప్పించే బాధ్యత పెద్ద కొడుకుగా నాది, నాలుగు రోజులు ఓపికతో ఉండండి అని రామా అడుగుతాడు. తప్పకుండా మేము వీళ్లిద్దరి పెళ్లి జరిగేలా చూస్తామని జానకి కూడా చెప్తుంది. సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను అని జెస్సి తండ్రి చెప్తాడు.


Also Read: గుండెల్ని మెలిపెట్టే సీన్, చిన్మయికి అన్నీ నిజాలు చెప్పిన రుక్మిణి- దేవి మాత్రమే కావాలని సత్యతో తెగేసి చెప్పిన ఆదిత్య


మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నా దీని వల్ల మీకు, అటు మన కుటుంబానికి, జెస్సికి ఎటువంటి సమస్య రాకూడదని కోరుకుంటున్నాను. మీ ప్రయత్నానికి నేను అండగా ఉంటాను, మీ చదువు మీద ధ్యాస పెట్టండి, ఈ సమస్య నేను చూసుకుంటాను అని రామా మాట ఇస్తాడు. అఖిల్ అబద్ధం చెప్పిన విషయం గుర్తు చేసుకుని జానకి బాధపడుతూ ఉంటుంది. జానకి తినకుండా ఉండేసరికి రామా తినిపించేందుకు చూస్తాడు కానీ వద్దని చెప్తుంది. ఇంట్లో అందరూ దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు. రామా అఖిల్ తో మాట్లాడటానికి ట్రై చేస్తాడు కానీ తప్పించుకుని తిరుగుతాడు. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే అఖిల్ నోటి వెంట నిజం చెప్పించాలి అదొక్కటే మార్గం అని రామా అనుకుంటాడు.