జెస్సి తల్లిదండ్రు పీటర్, మేరీ ఆవేశంగా జ్ఞానంబ ఇంటికి వస్తారు. మేము జెస్సితో మాట్లాడటానికి కాదు మీతో మాట్లాడటానికి వచ్చాం అని గోవిందరాజులుతో అంటాడు. మా అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని భయపడుతుంటే మీ అబ్బాయితో పెళ్లి జరిపి మా కన్నీళ్ళు తుడిచారు. కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదని పీటర్ అంటాడు. వాళ్ళని చూసి మల్లిక షాక్ అయి నా పేరు బయటకి రాకుండా ఉంటే బాగుండు అని టెన్షన్ పడుతుంది. మా అమ్మాయిని కాదుప పెట్టుకుని చూసుకుంటారు అనుకుంటే ఇంతగా కష్టాలు పెట్టి కన్నీళ్ళు పెట్టిస్తారని అనుకోలేదని మేరీ అంటుంది. మీ గొప్పదనం మాటల్లోనేనా చేతల్లో కనిపించదా అని పీటర్ కోపంగా అంటాడు. అసలు మీ అమ్మాయిని కష్టపెడుతున్నామని ఎవరు చెప్పారు అనేసరికి జానకి మల్లిక వైపు అనుమానంగా చూస్తుంది.


అవసరం లేకపోయిన కొంతమంది అగ్గి రాజేసి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీరు కాస్త నిజానిజాలు తెలుసుకుని ఆరా తీసి ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేదని జానకి అంటుంది. నీ చెల్లిలా చూసుకుంటాను అని మాట ఇచ్చి ఇప్పుడు మీ అత్తయ్య వాళ్ళని వెనకేసుకొస్తావా అని మేరీ కోపంగా అడుగుతుంది. రామా, జానకిని పీటర్ వాళ్ళు తిడుతుంటే జెస్సి వచ్చి వాళ్ళ మీద అరుస్తుంది. నేను ఇక్కడ అవస్థలు పడుతున్నా అని మీకు ఎవరు చెప్పారు నాన్న అని జెస్సి అడుగుతుంది. అత్తయ్యగారి వల్ల నేను కష్టాలు పడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నా అని ఎవరు చెప్పారు అంటే మల్లిక నా పేరు చెప్పొద్దు అని సైగ చేస్తుంది. అది జానకి కూడా గమనిస్తుంది. నేను కోడలిగా వచ్చింది ఒక ఇంటికి కాదు దేవాలయానికి దేవతలాంటి అత్తయ్యగారి చల్లని నీడలోకి, ప్రేమకి ప్రతిరూపం అయిన జానకి అక్క చెంతకి, అహం అంటే ఏంటో తెలియని వాళ్ళ దగ్గరకి వచ్చాను. ఇంకోసారి ఎవరో మాటలు నమ్మి ఇలా వస్తే మీ కూతురు దగ్గరే మీ గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని జెస్సి కోపంగా అంటుంది.


Also Read: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు


చిన్న పొరపాటు చెప్పుడు మాటల వల్ల ఇలా వచ్చాం ఇంకెప్పుడు ఇలా తప్పు చెయ్యము మమ్మల్ని క్షమించమని పీటర్, మేరీ ఇంట్లో అందరినీ అడుగుతారు. నా అత్తగారింటిని అనవసరంగా మాటలు అంటే ఊరుకోనక్కా అని జెస్సి జానకితో అంటుంది. మా అమ్మానాన్న తరపున నేను క్షమాపణ చెబుతున్నా అని జెస్సి జ్ఞానంబని క్షమించమని అడుగుతుంది. తన ప్లాన్ వెయిల్ అయినందుకు ఫీల్ మల్లిక ఫీల్ అవుతుంది. ఇంట్లో ఏం జరిగినా అందుకు నేను కారణం కాదు కాదు అని మల్లిక అరుస్తూ ఉంటే గోవిందరాజులు వస్తాడు. నేను గర్భవతి అయ్యాక తినడానికి తప్ప మిగతా విషయాలల్లో వేలు పెట్టడం మానేశాను అంటుంది. కానీ గోవిందరాజులు మాత్రం నువ్వే దీనికి కారణం అని తెలిస్తే మాత్రం నీకు ఉంటాదని వెళ్ళిపోతాడు.


జానకి చదువుకుంటూ ఉంటుంటే జెస్సి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని వస్తుంది. అత్తయ్యగారు నన్ను ఒక దోషిలా చూస్తున్నారు. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి టైమ్ లో సపోర్ట్ గా ఉండాల్సిన అఖిల్ నాతో కోపంగా ఉంటున్నాడు, నాకు దూరంగా ఉంటున్నాడు జీవితాంతం ఇక్కడే ఉండాల్సిన దాన్ని వాళ్ళు అలా నాతో ప్రవర్తిస్తుంటే నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు అందుకే సలహా అడుగుదామని వచ్చాను అని చెప్తుంది.  


Also Read: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ