జానకి తన ఐపీఎస్ చదువు వదిలెయ్యడానికి సిద్ధపడుతుంది. అటు ఇంట్లో అందరూ అఖిల్ గురించి బాధపడుతూ ఉంటారు. అటు గోవిందరాజులు, జెస్సి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి రామా విలవిల్లాడిపోతాడు. రామా జానకికి ఇచ్చిన గడువు అయిపోయిందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జానకి రామా దగ్గరకి వస్తుంది పదండి రామా గారు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనేసరికి రామా చాలా సంతోషిస్తాడు. అఖిల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తుంది. రామా సంతోషంగా తనని కౌగలించుకుని వెంటనే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అందరినీ పిలుస్తాడు.


స్టేషన్ నుంచి తమ్ముడు ఇంటికి వచ్చేస్తున్నాడు, జానకి కేసు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకుందని చెప్తాడు. అఖిల్ మీద తాను పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటున్నాను అని జానకి తన నోటితో చెప్పేసరికి ఇంట్లో అందరూ సంతోషిస్తారు. ఇద్దరు స్టేషన్ కి వెళ్తుంటే మేము వస్తామని జ్ఞానంబ అంటుంది. వద్దులే వాడికి ఆకలిగా ఉంటుంది బాగా వండి పెట్టమని చెప్తాడు. అఖిల్ అరెస్ట్ ని అడ్డం పెట్టుకుని జానకిని వెళ్లగొట్టొచ్చు అనుకుంటే ఇలా రివర్స్ అయ్యిందేంటి అని మల్లిక తిట్టుకుంటుంది. జానకి, రామా లాయర్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తారు. వాళ్ళని చూసి అఖిల్ రామాని పిలుస్తాడు. అఖిల్ ఈ కేసు నుంచి బయటకి రావడానికి వీల్లేదని పోలీస్ సునంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. లాయర్ తో వచ్చారు అంటే విడిపించడానికే అయ్యి ఉంటుందని పోలీసు మనసులో అనుకుంటాడు.


Also read: మాజీ భార్య ఆలోచనల్లో నందు- తులసి మీద ద్వేషం పెంచుకుంటున్న అనసూయ


ఈరోజు మీ తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఏమైనా ఉంటే అక్కడే చూసుకోండి అని పోలీస్ రామాకి చెప్తాడు. మీకు సాక్షిగా కంప్లైంట్ ఇచ్చారే తప్ప వాడే తప్పు చేశాడు అనేదానికి ఏ ఆధారం లేదు అలాంటప్పుడు కోర్టు దాకా ఎందుకు రూల్స్ ప్రకారం లాయర్ గారి ద్వారా తమ్ముడిని విడిపించుకుని తీసుకెళ్తామని రామా చెప్తాడు. ఆ సాక్ష్యం చాలు మీ తమ్ముడిని కోర్టు దాకా తీసుకెళ్లాడానికి జైలుకి పంపించడానికి అని పోలీస్ చెప్తాడు. ఒక వేళ ఆ సాక్ష్యం అబద్ధం అయితే అని రామా అంటాడు. మీ భార్యే కదా చూశాను అని చెప్పిందని పోలీస్ చెప్తాడు. తాను చూసింది పొరపాటు అని ఇన్ స్పెక్టర్ గారికి అర్థం అయ్యేలా చెప్పమని జానకికి రామా చెప్తాడు.


ఎఫ్ ఐ ఆర్ ఫైల్ అయ్యింది ఇక చెప్పేది ఏముంది అఖిల్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడమేనని పోలీస్ చెప్తాడు. జానకి గారు ఒక అమ్మాయికి ఇన్ జ్యూర్ అవడం చూసింది నిజమే కానీ అఖిల్ అని పొరబడ్డారని లాయర్ చెప్తాడు. కానీ ఈ విషయం జానకి చెప్పాలని పోలీస్ అంటాడు. జానకి అఖిల్ అనుకుని పొరపాటు బడ్డాను అని చెప్తుంది. ఆ మాటకి రామా, అఖిల్ ఊపిరి పీల్చుకుంటారు. కేసు పెట్టిన నా భార్య దోషి కాదని చెప్తున్నారు కదా అఖిల్ ని విడిచి పెట్టమని రామా అడుగుతాడు. లాయర్ బెయిల్ పేపర్స్ ఇస్తాడు. ఇప్పుడు అఖిల్ ని విడుదల చేసిన కూడా కేసు ప్రొసీడింగ్స్ లో కోపరేట్ చేయాలని ఎస్సై రామాతో చెప్తాడు. అఖిల్ ని రిలీజ్ చేస్తారు.


Also Read: ఊహించని ట్విస్ట్, వేద కేసులో ఒడిపోవాలంటున్న యష్- యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదా?