నా ఐపీఎస్ ఆశని బతికించమని ఆ రోజు నీకు ముడుపు కట్టాను. నా ఇష్టాన్ని కలని నా భర్త అర్థం చేసుకున్నారు నా చదువు క ప్రతిక్షణం దేవుడిలా అండగా నిలబడ్డారరు. ఇప్పుడు నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఐపీఎస్ సాధించడం రెండు మా అత్తయ్యగారు పెట్టిన పరీక్షలో గెలవడం. నేను ఎలా ఉండాలని నా వైపు నుంచి అత్తయ్యగారు కోరుకుంటున్నారో అలా ఉండేలా చూడు ఆమె మనసులో ఉన్న భయాన్ని దూరం చేసే అవకాశం నాకివమ్మా అని జానకి చెట్టు దగ్గర అమ్మవారిని మొక్కుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జన్మ జన్మలకి నాకు ఈ రాముడినే భర్తగా ఇవ్వమని వేడుకుంటుంది. అదంతా విని రామా మురిసిపోతాడు. చెట్టుకు ముడుపు కట్టేందుకు అందకపోవడంతో రామా వచ్చి జానకిని ఎత్తుకుంటాడు.


జెస్సి అందంగా రెడీ అయ్యి జ్ఞానంబ ఉన్న గుడికి వచ్చి అఖిల్ వాళ్ళ కోసం వెతుకుతుంది. వాళ్ళు కనిపించగానే జెస్సి అఖిల్ కి ఫోన్ చేస్తుంది. వన్ అవర్ లో స్టార్ట్ అవుతాను అంటే అఖిల్ నువ్వు రానవసరం లేదు నేనే గుడికి వచ్చాను అని చెప్పడంతో షాక్ అయి చుట్టూ చూస్తాడు. నువ్వు గుడికి వచ్చావా అని అంటాడు. ఎందుకు వచ్చావ్ ఇక్కడికి నేను వస్తా అని చెప్పను కదా అని అఖిల్ అంటాడు. మీ ఫ్యామిలిని పరిచయం చెయ్యమని చాలాసార్లు అడిగాను సందర్భం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అని చెప్పావ్ కదా ఈరోజు నా బర్త్ డే ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుందని గుడికి వచ్చేశాను మీ వాళ్ళని పరిచయం చేసుకోవడంతో పాటు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అంటుంది. మతి లేకుదన మాట్లాడకు జెస్సి మన ప్రేమ విషయం చెప్పి ఇలా సడెన్ గా పరిచయం చెయ్యడం అంటే అదంతా సింపుల్ విషయం కాదు అర్థం చేసుకో ఒకసారి వీలు చూసుకుని మా అమ్మతో చెప్తాను ప్లీజ్ జెస్సి ఇప్పుడు నువ్వు వెళ్ళు అని బతిమలాడతాడు. వెళ్ళాను అని జెస్సి మొండికేస్తుంది.


Also Read: వాయమ్మో ఏందయ్యా ఈ రచ్చ- చిందులేసిన నందు, సామ్రాట్- తలలు పట్టుకున్న తులసి, లాస్య


అప్పుడే రామా, జానకి అటుగా వస్తూ జానకి కంట పడతారు. జెస్సిలాగా ఉందే అఖిల్ కి ఎలా తెలుసు అని మనసులో అనుకుని వాళ్ళదగ్గరకి వెళ్లబోతుంటే జానకిని చూసిన అఖిల్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. జానకి జెస్సి దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. నువ్వేంటి ఇక్కడ అని జానకి అడిగితే నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అని చెప్పేస్తుంది. ఎవరతను అని అడుగుతుంది. ఇప్పటివరకు నాతో మాట్లాడి వెళ్ళాడు కదా అతనే పేరు అఖిల్ అని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. చచ్చింది గొర్రె అని అఖిల్ తలపట్టుకుంటాడు. వాళ్ళ మాటలు చాటుగా వింటూ చూస్తూ ఉంటాడు. జానకి జెస్సితో మాట్లాడటం జ్ఞానంబ చూసి ఆ అమ్మాయి తనతో దురుసుగా ప్రవర్తించిన విషయం గుర్తు చేసుకుని కోపంగా చూస్తుంది. జానకి అని గట్టిగా పిలుస్తుంది.


ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటమేనా పదా అని జ్ఞానంబ అంటుంది. అత్తయ్యగారు తను నా ఫ్రెండ్ మొన్ననే అకాడమీలో పరిచయం అయ్యింది అని చెప్తుంది. స్నేహం చేసే ముందు వాళ్ళు ఎంతో వాళ్ళ గుణగణనాలేంటో తెలుసుకుని పరిచయం చేసుకోవాలి, తనెంటో తనలో ఎంత సంస్కారం ఉందో తన ఒంట్లోనూ, తలలోనూ ఎన్ని తన్నుల పొగరు ఉందో మొన్న మీ కాలేజీకి వచ్చినప్పుడే చూశాను ఆచారు సాంప్రదాయాలంటే లెక్కలేదు. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు కడుపు నింపే అన్నం అంటే విలువ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే అహంకారానికి బట్టలు వేసినట్టు ఉంటుంది. ఇలాంటి పొగరుబోతుతో నీకు స్నేహం ఏంటి అని జానకిని తీసుకెళ్తూ అఖిల్ ని పిలుస్తుంది. అఖిల్ తనని అమ్మా అని పిలవడం చూసి షాక్ అవుతుంది.


Also Read: రెచ్చిపోతే సచ్చిపోతావంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన రాధ - భాగ్యమ్మ చివరి కోరిక రుక్మిణి తీరుస్తుందా?


జెస్సి జానకి వదినతో మాట్లాడింది అసలు ఏం చెప్పిందో ఎంతో లవ్ లో ఉన్నామని చెప్తే ఇంట్లో నా పని అయిపోయినట్టే అని అఖిల టెన్షన్ పడుతూ ఉంటాడు. దేనిగురించి అంతగా టెన్షన్ పడుతున్నావ్ జెస్సి గురించేనా అని జానకి డైరెక్ట్ గా అడిగేస్తుంది. నేను తన గురించి ఎందుకు టెన్షన్ పడతాను అని అంటాడు. నిజం చెప్పు మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటని జానకి నిలదిస్తుంది. జస్ట్ ఫ్రెండ్ వదిన అని అంటాడు. మరి జెస్సి నిన్ను బి ఫ్రెండ్ అని చెప్పింది అనేసరికి అఖిల్ ఛీ ఛీ అలాంటిదేమీ లేదని అంటాడు. నువ్వు నా వదినవని తెలిసి ఉంటుంది అందుకే సరదాగా ఆట పట్టించడానికి అలా చెప్పి ఉంటుంది అంటే తప్ప మా మధ్య ఏమి లేదని చెప్తాడు. మీ అమ్మగారి గురించి నీకు బాగా తెలుసు కొన్ని విషయాల్లో ఎంత కచ్చితంగా ఉంటారో నువ్వు చూస్తూనే ఉన్నావ్ మీ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే కాకుండా ఇంకేదైనా ఉంటే అది మన ఇంటికి చాలా పెద్ద సమస్యగా మారుతుంది, పరిస్థితులు అంత దూరం రాకుండా ఉండాలంటే నిజం చెప్పు అది నీకే కాదు మన కుటుంబానికి కూడా మంచిది కాదని హెచ్చరిస్తుంది. అదేమీ లేదు నిజంగా ఫ్రెండ్ మాత్రమే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయ్ వదిన అని అఖిల్ వెళ్ళిపోతాడు.


జానకి మాత్రం వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అఖిల్ ఎందుకో మాట దాటేసి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా రామా వస్తాడు. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు నాకు కూడా చెప్పండని అంటాడు. జానకి చదువుకుంటూ ఉండగా రామా సోఫాలోఅలాగే నిద్రపోతాడు. అది కాస్త జ్ఞానంబ కంట పడుతుంది. తన చదువు భార్యాభర్తల ఏకాంతానికి దూరం కాకూడదని చెప్పను కానీ తను చదువుకి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప భర్తకి కాదు చదువు ధ్యాసలో పడి పక్కన భర్త ఉన్నాడని మర్చిపోయిందని జ్ఞానంబ మనసులో బాధపడుతుంది.