మల్లిక తమ్ముడికి రాఖీ కట్టి జానకిని గిల్లుతుంది. ఏంటి జానకి మీ అన్నయ్యకి రాఖీ కట్టే అదృష్టం లేదని  బాధపడుతున్నావా? ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అత్తయ్యగారు మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మన్నారు. కానీ మీ అన్నయ్యకే ఫోన్ చెయ్యలేదు అంటే మీ అన్నయ్య చేసిన మోసం అత్తయ్యగారి మనసులో అగ్నిపర్వతంలా రగులుతూనే ఉందన్నమాట, జానకి ఇక మీ అన్నయ్యకి రాఖీ కట్టే అదృష్టం ఇక లేదు అందుకని గుండెని కిడ్నీని రాయి చేసుకో అని మల్లిక వాగుతుంది. ఏయ్ నోరు మూస్తావా నువ్వు ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారనే బుద్ధి కూడా లేకుండా పోయింది నీకు అని జ్ఞానంబ చీవాట్లు పెడుతుంది. నీ వేతకారాలు అర్థం చేసుకోలేననుకున్నావా ఇంకోసారి ఇలా తోటి కోడలిని బాధపెట్టినా అవమానకరంగా మాట్లాడినా బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. అందరం గుడికి వెళ్ళాలి బయల్దేరామని చెప్తుంది.


Also Read: దేవి ముందు ఆదిత్యని ఇరికించి పైశాచికానందం పొందిన మాధవ- రాధ, ఆదిత్యల ఆవేశం


జానకి తన గదిలో బాధగా ఉంటే రామా వస్తాడు. అమ్మతో మాట్లాడమంటారా మీరు వెళ్ళి మీ అన్నయ్యకి రాఖీ కట్టి వస్తారు అని రామా అనడం జ్ఞానంబ వింటుంది. వద్దు రామాగారు మా మధ్య ఆ బంధం, అనుబంధం ఎప్పుడో తెగిపోయాయి, మనుషుల మధ్యే కాదు మనసుల మధ్య కూడా దూరం పెరిగిందని జానకి బాధగా అంటుంది. నా మనసులో బాధ లేదని మీకు చెప్పలేను కానీ నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి రాఖీ కాటాని రోజు లేదు, ఎప్పుడెప్పుడు రాఖీ కడతానా అని ఎదురు చూసేదాన్ని. అటువంటి మంచి జ్ఞాపకం ఇప్పుడు చెడు జ్ఞాపకంగా మారిందని బాధపడకుండా ఎలా ఉంటాను అని జానకి అంటుంది. మీరు వెళ్ళి మీ అన్నయ్యకి రాఖీ కడితే ఆ బాధ పోతుంది కదా అంటాడు. మీ అన్నయ్యకి రాఖీ కట్టలేదనే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అది నేను చూడలేను నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాను మీరు వెళ్ళి మీ అన్నయ్యకి రాఖీ కట్టి రండి అని చెప్తాడు.


అత్తయ్యగారికి ప్రేమించడం, క్షమించడం తప్ప వేరే ఏమి తెలియదు. అందుకు మనమే ఉదాహరణ. అత్తయ్యగారు మా అన్నయ్యని క్షమించలేదంటే ఆయన అన్న మాటలు అత్తయ్యగారి మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో ఆలోచించండి, ఎంత బాధపడి ఉంటారో మీఊ వెళ్ళి మాట్లాడి ఆత్తయ్య బాధ పెంచకండి రామాగారు అని చెప్తుంది. మీరు చెప్పేది నిజమే కానీ ఒకసారి మాట్లాడితేనే కదా అమ్మ మనసులో ఏముందో తెలిసేది అని అంటాడు. అత్తయ్యగారు పెద్ద మనసు చేసుకుని మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఒప్పుకున్నా నేను వెళ్ళాను నా భర్తని అవమానించిన వాళ్ళు నా అత్తారింటిని తక్కువ చేసిన వ్యయాలు నా రక్త సంబంధీకులు అయినఅ నాకు అక్కర్లేదనీ అంటుంది.


అఖిల్ ఎక్కడికో అమ్మాయి దగ్గరకి వెళ్తున్నట్టు ఉన్నాడని మల్లిక అనడంతో జ్ఞానంబ తిడుతుంది. నా కొడుక్కి అటువంటి ఆలోచనలు లేవు నువ్వు లేనిపోనివి కల్పించకు అని చెప్తుంది. నీ చిన్న కూతురు లాగానే నీ కొడుకు కూడా ఏదో ఒక రోజు ప్రేమ్ అని బాంబ్ పేలుస్తాడు అప్పుడు తిక్క కుదురుతుందిలే అని మల్లిక మనసులో అనుకుంటుంది. ఫ్రెండ్ బర్త్ డే తర్వాత ముందు గుడికి వెళ్ళాలి పదా అని జ్ఞానంబ చెప్తుంది కానీ అఖిల్ ఎంత చెప్పినా వినకుండా గుడికి వెళ్ళి తీరాల్సిందే అని తేల్చి చెప్తుంది. అందరూ కలిసి వెళ్తుంటే అఖిల్ మాత్రం వెనక ఆగి జెస్సీకి మెసజ పెడతాడు అది జానకి గమనిస్తుంది. ఆ మెసేజ్ విన్న జెస్సి తను కూడా గుడికి వెళ్లాలని అనుకుంటుంది. గుడిలో జానకి వాళ్ళ అన్నయ్య ఉంటాడు. తనని చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. జానకి మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఈ అన్నయ్య మీద కోపం ఉందని తెలుసు కానీ భరించలేనంత ద్వేషం ఉందని తెలియదు అని బాధపడతాడు. ఒక్కసారి పలకరించండి అని రామా చెప్తాడు. ఎలా పలకరించను ఏరోజు అయితే అందరి ముందు నా భర్త వంటవాడు అని అవమానించాడో ఆరోజే అన్నా చెల్లెళ్ల బంధం తెగిపోయింది, అసలు నాకు పుట్టింటి వాళ్ళే లేరు అని అంటుంది.


Also Read: అభిమన్యుతో ఎందుకు చేతులు కలిపారని నిలదీసిన కాంచన- అభి, మాళవిక చేతిలో యష్ బిజినెస్ సీక్రెట్స్


అన్నని క్షమించమని అందరూ చెప్తారు. నేను చేసింది తప్పే తల దించుకుంటున్నాను క్షమించు అని వేడుకుంటాడు. నా భర్తని అవమానించిన విషయంలో నేను క్షమించను అని తెగేసి చెప్తుంది. ఆ మాటకి జ్ఞానంబ జానకి అని పిలిచి రాఖీ అందించి మీ అన్నయ్యకి కట్టు అని చెప్తుంది. అత్తయ్యగారు క్షమించడం మీ మంచి మనసు కావచ్చు కానీ నా భర్తకి జరిగిన అవమానం తాలూకు బాధ నా మనసులో అలాగే ఉందని అంటుంది. నాకు ఉంది కానీ ఈ రాఖీ పండగ అన్న చెల్లెల అధ్బుతమైన జ్ఞాపకం అటువంటిది మీకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు అది తలుచుకుని మీరు జీవితాంతం బాధపడకూడదు అందుకే మీకు అలా బాధపడే పరిస్థితి రాకూడదనే మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలిచాను అని చెప్తుంది.