Janaka Aithe Ganaka First Review: రీసెంట్ గా ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో సుహాస్.. ‘జనక అయితే గనక’ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో సంకీర్తన హీరోయిన్ గా తెరకెక్కింది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం స్పెషల్ ప్రీమియర్ వేశారు. హీరో సుహాస్, దర్శకుడు సందీప్, నటుడు వెన్నెల కిశోర్ తో పాటు నిర్మాత దిల్ రాజు వారితో కలిసి సినిమా చూశారు. మూవీ కంప్లీట్ అయ్యాక సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సుహాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందన్నారు.
ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించండి!
‘జనక అయితే గనక’ సినిమాలో మిడిల్ క్లాస్ జీవితాన్ని చూపించారని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. “మూవీ చాలా ఫన్ గా ఉంది. నిజ జీవితాన్ని చూపించేలా తీసిన సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్, కిశోర్ తెర మీద బాగా నవ్వించారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మాకు స్ట్రెస్ ఫీలింగ్ తగ్గుతుంది. మీరు పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఇలాంటి చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చెయ్యంది” సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటేష్ నిర్మాత దిల్ రాజుకు రిక్వెస్ట్ చేశారు.
భార్యభర్తల మధ్య నమ్మకం అవసరం
భార్యభర్తల మధ్య నమ్మకం ఉన్నప్పుడే ఏ విషయంలోనైనా సక్సెస్ అవుతారని మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెప్పారు. “ఏ మూవీలో లేని ఫ్యామిలీ రిలేషన్ ఇందులో ఉంది. ఒక భార్యకు భర్త మీద నమ్మకం ఉంటే, అదే భర్తకు భార్య మీద నమ్మకం ఉంటే ఎంత సక్సెస్ అవుతారో ఈ సినిమాలో చూపించారు. రిలేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ సినిమా నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు ఇంకా తీయండి” అన్నారు.
తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాంప్రమైజ్ కారు
“ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ ను టట్ చేసింది. అన్ని అంశాలు చాలా రియల్ గా ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో జరిగేవే. మా నాన్న సాధారణ సూపర్ వైజర్. ఆయనకు వచ్చే జీతం కంటే నా చదువుకు పెట్టిన ఖర్చు ఎక్కువ. ఆయన నెల జీతం నాకు బస్ ఫీజ్ కట్టడానికే సరిపోయేది. గొప్పల కోసం చదివించుకుంటున్నారని చాలా మంది అనేవాళ్లు. వాళ్ల మాటలు పట్టించుకుని తను చదివించకపోయి ఉంటే, నేను ఈ రోజు ఈస్థాయిలో ఉండేదాన్ని కాదు. సినిమాలో అదే విషయాన్ని చూపించారు” అని లేడీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెప్పుకొచ్చింది. అటు ఈ రోజుల్లో చదువుల కోసం మధ్య తరగతి వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సినిమాలో చక్కగా చూపించారని మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెల్లడించారు.
రియల్ లైఫ్ బేస్ చేసుకుని తీసిన సినిమా- దిల్ రాజు
వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. మంచి సినిమాలు ఆడుతుంటే మంచి కిక్ వస్తుంది. అలా కిక్ తీసుకొచ్చే సినిమాల్లో ఇదొకటి కాబోతోంది. దర్శకుడు సందీప్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఘనటలను బేస్ చేసుకుని ఈ సినిమా తీశాడు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులలో కలుగుతుంది. ఇందులో కావాల్సినంద ఫన్, ఎమోషన్ ఉంటుది” అని చెప్పుకొచ్చారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై 'జనక అయితే గనక' సినిమా తెరకెక్కింది. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Read Also: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?