Jagadhatri Serial Today Episode: లోను అమౌంట్‌కు వడ్డీకట్టాలంటూ  కేదార్ తన పర్సులో నుంచి డబ్బులు తీసి వాళ్లకు ఇస్తాడు. ఆ పెద్దాయన వద్దు బాబు అని చెప్పినా  ఇవ్వబోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు...వచ్చి మేం అండగా ఉంటామని చెప్పడంతో  జగధాత్రి, కేదార్ ఎంతో సంతోషిస్తారు.

Continues below advertisement

గొప్పలకు పోయి అప్పులు చేశానని..ఇప్పుడు ఇంద్రాణికి డబ్బులు ఇవ్వకపోతే...కౌషికి మొత్తం చెప్పేస్తోందని నిషిక మథనపడిపోతుంది.  ఈసారి కౌషికి విషయం తెలిసిందంటే...వేరే విధంగా ఉంటుందని భయపడిపోతుంది. ఇన్ని తెలిసి ఇంద్రాణి వద్ద డ‌బ్బులు ఎందుకు తీసుకున్నావని యువరాజు అంటాడు. నేను డబ్బులు తీసుకునేప్పుడు అవి ఇంద్రాణివి అని తెలియక తీసుకున్నాను అంటుంది. ఇంతలో మీనన్‌ యువరాజుకు ఫోన్‌ చేస్తాడు. వైజాగ్ పోర్టుకు ఓ పార్శిల్ వచ్చిందని...దాన్ని  హైదరాబాద్‌ శివారు వరకు నా మనుషులు తీసుకొస్తారని.. నువ్వు దాన్ని గోదాముకు చేర్చాలని చెబుతాడు. సిటీలో ఎలక్షన్‌ల వల్ల సెక్యూరిటీ  ఎక్కువగా ఉందని...కాబట్టి ఆ ఆర్డీఎక్స్‌ పార్శిల్‌ను  నువ్వే తీసుకుని రావాలని చెబుతాడు. ఇప్పుడిప్పుడే మా అక్క నన్ను నమ్ముతోందని...ఈ పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయలేనని అంటాడు. ఒక మూడు నెలలు నాకు సమయం ఇస్తే...మా అక్క కంపెనీ మొత్తం నా చేతుల్లో పెడుతుందని...అప్పుడు మీరు ఏం చెబితే అది చేస్తానని అంటాడు. ఇంతలో యువరాజు నుంచి ఫోన్‌ లాక్కుని మీనన్‌తో నిషిక మాట్లాడుతుంది. మా ఆయన నువ్వు చెప్పిన పనిచేస్తాడని...ఆయన చెయ్యకపోతే నేను చేస్తానని అంటుంది. మీనన్‌తో వ్యవహారం అంటే ప్రాణాలకే ప్రమాదమని యువరాజు  హెచ్చరిస్తాడు. ఇంట్లో ఇలా బయపడుతూ బతకడం కన్నా...అదే బెటర్‌ అని నిషిక అంటుంది.

పేపర్‌లో ఇచ్చిన యాడ్ చూడటం కోసం కేదార్‌ ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. ఇంతలో పేపర్‌ బాయ్‌ పేపర్ వేసి వెళ్తాడు. శ్రీవల్లి వెళ్లి ఆ పేపర్‌ తీసుకుని వస్తుంది. ఆ పేపర్‌ కేదార్ చేతికి ఇస్తుంది. తాను ఇచ్చిన యాడ్‌ కౌషికికి చూపిస్తాడు. మా అమ్మకు నేను కాకుండా  ఇంకో బిడ్డ కూడా ఉందని మాకు ఈ మధ్యనే తెలిసిందని కేదార్‌ వాళ్ల అక్క కౌశికితో చెబుతాడు. ఈ మాటలు విన్న వైజయంతి కొయ్యబారిపోతుంది. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందోనని నిషిక ఆమె వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో  శ్రీవల్లి కలుగజేసుకుని  ఈ యాడ్‌ చూసి వాళ్లు నీకు ఫోన్ చేస్తే...మీ చెల్లెని కానీ, తమ్ముడిని గానీ కలవచ్చు కదా అంటుంది.ఈ విషయం చెప్పగానే అందరూ  సంతోషంగా ఫీలవుతారు అనుకుంటే మీరంటే ఇంకా షాక్‌లోనేఉన్నారని జగధాత్రి అంటుంది. కేదార్‌కు నిజంగా  చెల్లెలు ఉండి ఉంటే వాళ్లు ఇన్నాళ్లు వెతక్కుండా ఉంటారా అని కౌషికి అంటుంది. ఈ విషయం వాళ్లకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదా వదినా అని జగధాత్రి బదులిస్తుంది.ఇంతలో  శ్రీవల్లి కౌషికిని పేపర్‌ అడుగుతుంది. కేదార్‌ వాళ్ల అమ్మను నేను కూడా చూస్తానంటుంది. శ్రీవల్లి పేపర్ తీసుకోగానే భయపడిపోయిన వైజయంతి తన చేతిలో ఉన్న దేవుడి హారతి పల్లెం కిందపడేసి అందరి దృష్టి మరల్చుతుంది. శ్రీవల్లిచేతిలో ఉన్న పేపర్ తీసుకుని హారతి మీద వేసి కాల్చివేస్తుంది. ఇది చూసి కేదార్ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. జగధాత్రి కల్పించుకుని మీరు పేపర్ కాల్చిపడేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తుంది. ఏదో  కంగారులో పడేశానులే అని తప్పించుకుని వెళ్లిపోతుంది...

Continues below advertisement