Deputy CM Pawan Kalyan comments: కోనసీమ జిల్లాలో దిష్టి గురించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ కోరింది. తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు చేస్తున్న రాజకీయంపై జనసేన పార్టీ స్పందించింది. రెండు రాష్ట్రాల మద్య సుహృద్భావ వాతావరణం ఉందని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని రెండు లైన్ల ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది.
హఠాత్తుగా విమర్శలు ప్రారభించిన కాంగ్రెస్ నేతలు
గత వారం కోనసీమలో కొబ్బరి చెట్లు తలలు వాల్చేస్తున్న అంశంపై పవన్ కల్యాణ్ రైతులతో మాట్లాడారు. ఆ సందర్బంగా రాష్ట్ర విభజన కు కోనసీమ పచ్చదనం కారణం అని.. తెలంగాణ నేతల దిష్టి తగిలిందని అన్నారు. చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కొంత మంది మంత్రులు ఘాటుగా స్పందించడం ప్రారంభించారు.సినిమాలు ఆపేస్తామని.. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా మట్లాడుతూండటంతో ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో దీనికి తెరదించాలని జనసేన పార్టీ ఈ ప్రకటన జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.
వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జగదీష్ రెడ్డి సలహా
మరో వైపు పవన్ వ్యాఖ్యల పై లేటుగా స్పందిస్తున్న కాంగ్రెస్ నేతల పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పాల్సి ఉందన్నారు. వారాంతం తెలంగాణకు ఎక్కువగా వచ్చే పవన్ కి ఇక్కడే ఎక్కువ ఆస్థులున్నాయి.. ఎక్కువ సమయం తెలంగాణాలోనే ఉన్న పవన్ ఇక్కడి ప్రాంతాన్ని కూడా ప్రేమించాలన్నారు. పవన్ పరిణతి చెందిన నాయకుడిగా ఇప్పటికే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సి ఉందని.. ఉద్యమం తరవాత అంతా ఎక్కడా క్రాస్ టాక్ మా వైపు నుండి రాలేదని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. మంచి కాంక్షించి అందరిని కడుపులో పెట్టి చూసుకున్నాం ..పది రోజుల తరువాత పవన్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా..కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా అని ప్రశ్నించారు.
సినిమాలను ఎలా ఆపుతారని కోమటిరెడ్డిని ప్రశ్నించిన జగదీష్ రెడ్డి
పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారు..కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా అని ప్రశఅనించారు. సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడొద్దని కొమటిరెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలి..పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.