యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మూవీ టీమ్ ఇటీవలే క్లారిటీ ఇవ్వడంతో సినిమా క్యాన్సిల్ అవ్వలేదని అర్థమైంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయని సినీ వర్గాల టాక్. ఇప్పుడీ సినిమాలో మెడికల్ మాఫియాకు సంబంధించిన అంశాన్ని పొడిగిస్తూ ఒక లైన్ ను ఎన్టీఆర్ కు చెప్పారట కొరటాల. ఆ పాయింట్ ఎన్టీఆర్ కు నచ్చడంతో దానిపై కసరత్తు ప్రారంభించారట మూవీ టీమ్. ఇది దాదాపు మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా విషయంలో విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కొరటాల మళ్ళీ మూల కథను మార్చి చేస్తే సినిమా ఇంకెంత లేట్ అవుతుందో అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 


సినిమాలో కార్పొరేట్ వైద్యం సవాళ్ళను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. కార్పొరేట్ వైద్యం పేదల పాలిట అందని ద్రాక్షలా ఎందుకు మారింది? అందుకు గల కారణాలను డెప్త్ లోకి వెళ్లి చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట కొరటాల. సినిమాలో ఓ సంపన్నుడి చివరి క్షణాలు ధీన పరిస్థితుల్లో ఎలా ముగిశాయి అనే పాయింట్ ను మెడికల్ మాఫియాకి అన్వయించి కొత్త మెసేజ్ ను ఇచ్చే విధంగా ఈ కథ ఉంటుందని టాక్. ఎమోషనల్ సీన్స్ తో మంచి మెసేజ్ ఇచ్చే విధంగా స్క్రిప్ట్ రాసుకోవడంలో కొరటాల రూటే సపరేటు. తన మార్క్ రైటింగ్ స్టైల్ తో కథను మరింత బలంగా తీర్చిదిద్దుతున్నారట కొరటాల. 


నిజానికి ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండనుందని అందరూ అనుకున్నారు. అందుకే ఫస్ట్ లుక్, టీజర్ ఆ లెవల్ లో విడుదల చేశారు. ఇప్పుడీ కథకు మెడికల్ మాఫియా బ్యాగ్రౌండ్ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులకు ఎలాగో ఇంకో మూడు నెలలు పట్టడంతో వచ్చే ఏడాదిలో సినిమా పనులు ప్రారంభం అవుతాయని ఫిల్మ్ సర్కిల్ లో టాక్. వాస్తవంగా ఇలాంటి మెడికల్ బ్యాగ్రౌండ్ అంశాలు ఉన్న సినిమాలు గతంలోనూ వచ్చాయి. చిరంజీవి 'ఠాగూర్' లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే ఆ సినిమాల్లో కొంత భాగం మాత్రమే మెడికల్ మాఫియాకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ 30లో మూల కథే మెడికల్ మాఫియా కావడం, అదీ ఫుల్ లెన్త్ లో ఆ పాయింట్ ను లీడ్ చేస్తున్నారు కాబట్టి మెడికల్ రంగానికి సంబంధించిన ఎన్నో చీకటి కోణాలను సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్. ఒకవేళ ఇదే నిజం అయితే ఇండస్ట్రీలో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ సినిమా రిలీజ్ టైమ్ కు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, ఎన్టీఆర్-కొరటాల కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


Also Read: 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు తిరిగొచ్చిన 'సుడిగాలి' సుధీర్?