పండగలు వచ్చాయంటే చాలు ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఎంతో ఆనందాన్ని అందించడమేకాకుండా మధురమైన జ్ఞాపకాలను మిగుల్చుతాయి. చాలా మంది ఉద్యోగ, వ్యాపార రీత్యా దూరంగా ఉండే వారంతా పండగ వస్తే చాలు సొంతింటికి పయనం అవుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. అలాంటి పండగల జాబితాలో ఇప్పుడు హోలీ వంతు వచ్చేసింది. కుల మత, చిన్నపెద్దా తేడా లేకుండా అందరూ కలసి సరదాగా గడిపే పండగే ఈ హోలీ. ఈసారి హోలీకు కూడా చాలా మంది చాలా ప్లాన్స్ వేసుకొని ఉండుంటారు. కొంత మంది ఇంట్లో పిండివంటలు వండుకొని ఫ్యామిలీతో సరదాగా గడపాలి అనుకుంటారు. ఇలాంటి సమయంలో టీవీల్లో వచ్చే మంచి సినిమాలు కోసం కూడా వెతుకుతుంటారు. ఈ మధ్య వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీరు గనుక వెబ్ సిరీస్ లవర్స్ అయితే. ఈ హోలీ పండగను మరింత ఆనందంగా గడవడానికి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ జాబితాను చూసేయండి. (గమనిక: ఉమెన్స్ డే, హోలీ పండుగలకు.. ఈ వెబ్ సీరిస్‌లకు అస్సలు సంబంధం లేదు. కేవలం వినోదం కోసమే). 


మీర్జాపూర్: 


భారత దేశ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లలో ఇది ఒకటి. చాలా మంది ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. ఒకవేళ చూడని వారు ఉంటే ఇప్పుడు చూసేయండి. ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ ప్రాంతంలో జరిగే ఒక ఆధిపత్య పోరు కు సంబంధించిన కథ. కాస్త బోల్డ్ కంటెంట్ ఉన్నా ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తయింది. మూడో సీజన్ త్వరలో విడుదల కానుంది. మీరు గనుక వెబ్ సిరీస్ లవర్స్ అయితే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అమోజాన్ ప్రైమ్ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.


పంచాయత్: 


అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉన్న మరో అద్భుతమైన వెబ్ సిరీస్ పంచాయత్. సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఓ మూరుమూల గ్రామంలో సెక్రటరీ గా జాయిన్ అయిన ఓ ఇంజినీరింగ్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో ఇది ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. 


రాకెట్ బాయ్స్: 


సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ అత్యంత ఆదరణ పొందింది. ఇది హోమీ జె. భాభా మరియు విక్రమ్ సారాభాయ్ జీవితాల ఆధారంగా రూపొందించబడింది. దీనికి అభయ్ పన్ను దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ లోని సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్చపరుస్తాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 పూర్తయింది. సీజన్ 2 స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది. 


ఫ్యామిలీ మెన్: 


భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లో ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ ఒకటి. బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో చేరిన మధ్యతరగతి వ్యక్తి నేరస్థులను గుర్తించి వారిని న్యాయస్థానంలోకి తీసుకురావడం చుట్టూ కథాంశం తిరుగుతుంది.  ఈ వెబ్ సరీస్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.  


కోటా ఫ్యాక్టరీ: 


వెబ్ సిరీస్ లవర్స్ ఎక్కువగా చూసిన సిరీస్ లలో ఈ ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. కోచింగ్ సెంటర్‌ లకు ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ హబ్ రాజస్థాన్‌ కోటాలో ఈ కథ సాగుతుంది. ఈ సిరీస్ ఇటార్సీ నుండి కోటకు మారిన 16 ఏళ్ల వైభవ్ (మయూర్ మోర్) జీవితాన్ని చూపుతుంది. ఇది నగరంలో విద్యార్థుల జీవితాన్ని, అలాగే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించడం ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో చేరేందుకు వైభవ్ చేసిన ప్రయత్నాలను ఎంతో ఆసక్తిగా చూపుతుంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 టివిఎఫ్ ప్లే, సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 


స్కామ్ 1992: 


వెబ్ సిరీస్ లలో మరో అద్భుతమైన సిరీస్ స్కామ్ 1992:ది హర్షద్ మెహతా స్టోరి. ఇది 1992 లో స్టాక్ మార్కెట్ లో జరిగిన రియల్ కుంభకోణం ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ స్టోరీ కశ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సోనీ లివ్ లో ఇది స్ట్రిమింగ్ లో ఉంది. 


ఉండేఖి: 


క్రైమ్ స్టోరీ లను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ వెబ్ మంచి సజెషన్ అవుతుంది. ధనవంతులు చట్టపరమైన లేదా సామాజిక నిబంధనలకు కట్టుబడి ఉండనందున వారు దేనినైనా ఎలా తప్పించుకోగలరు అనే దాని చుట్టూ కథ ప్రధాన కథాంశం తిరుగుతుంది. ఇది సోని లివ్ లో స్ట్రీమింగ్ లో ఉంది.


ఫర్జి:


2023 లో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇది కూడా చెప్పుకోదగ్గది. ఓ సాధారణ కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన అవసరాల కోసం దొంగనోట్లు ముద్రిస్తాడు. అయితే చివరకు పోలీసులకు తెలిసిపోవడంతో వారి నుంచి తప్పించుకోవడానిక ప్రయత్నిస్తాడు. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.