Illu Illalu Pillalu Serial Today Episode : ఇంట్లోనగలు పోవడానికి ధీరజుకు ఏమైనా సంబంధం ఉందేమోనంటూ వల్లి మాట్లాడుతుంది. నగలు పోవడానికి నాకేంటి సంబంధం అని ధీరజ్ ప్రశ్నించగా...భార్యను పోలీసు ఆఫీసరు చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా...ఇవన్నీ తీసుకుని వాటిని అమ్మేసి డబ్బుదాచి పెట్టి ఉంటావేమోనని అంటుండగా.. దీరజ్ భార్య ప్రేమ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తుంది. నా నగలు నేనే కొట్టేసి అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా అంటూ నిలదీస్తుంది. దీంతో రామరాజు మధ్యలో కల్పించుకుంటాడు. తన సంగతి వదిలేయండి...నేను అడుగుతున్నాను ఆ నగలు మీరు ఏమైనా తీశారా అంటూ కొడుకు దీరజ్‌ను నిలదీస్తాడు రామరాజు. వాళ్ల నగలు వారికి ఇవ్వకపోతే పెద్ద గొడవ జరుగుతుందని చెబుతాడు. ఆ నగలు మీరు తీశారన్న నింద మీ మీద వేయను గానీ...ఆ నగలు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని భద్రపరచాల్సిన బాధ్యత కూడా మీదే. మీ సంజాయిషీలు నాకు అక్కర్లేదు. రాత్రికల్లా గడువు ఇస్తున్నాను ...పోయిన నగలు తీసుకొచ్చి ఇవ్వండని అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు..
తండ్రి అడిగిన మాటలకు ఉక్రోషంతో గదిలోకి వెళ్లిన దీరజ్...తన భార్యను నగలు ఎక్కడ అని గట్టిగా నిలదీస్తాడు. ఇంతకు ముందే చెప్పాను కదా...నగల సంగతి నాకు తెలియదని మళ్లీ అడుగుతావేంటి అని అంటుంది.నీ చేతులతోనే కదా నగలు మీ వాళ్లకు పంపించింది. అవి మళ్లీ రోల్డ్‌గోల్డ్ నగలుగా ఏలా మారతాయని నిలదీస్తాడు. ఒకవేళ ఆ నగలను నువ్వు దాచిపెట్టి ఉంటే భయపడకుండా చెప్పాలని...ఎవరు ఏం అనకుండా నేను చూసుకుంటానని చెబుతాడు. దీంతో ప్రేమ మండిపడుతుంది. ఆ నగలన్నీ నావే....నిజంగా అవి నాకు కావాలంటే మావాళ్లకు ధైర్యంగా ఆ విషయం చెప్పగలను తప్ప.. నా నగలు నేను దొంగచాటుగా దాచుకోవాల్సిన పని ఏముందని అంటుంది. అయితే మీవాళ్లే మాతో గొడవ పెట్టుకోవడానికి నగలు మార్చేసి కుట్ర చేస్తున్నారని దీరజ్ అంటాడు. దీనికి ప్రేమ మావాళ్లు అంత ఛీప్‌గా బిహేవ్ చేయరని బదులిస్తుంది. అయితే మా నర్మద వదిన ఉద్యోగం పోవడానికి మీ వాళ్లే కారణం కాదా అని నిలదీస్తాడు. దీంతో ప్రేమ ఇప్పుడు జరుగుతుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటని ప్రశ్నిస్తుంది. నగలు కోసం మీ వాళ్లు ఎలా మాట్లాడారో చూశావు కదా...వాటి కోసమే మానాన్న ఓ రోజంతా పోలీసుస్టేషన్‌లో ఉండాల్సి వచ్చిందంటాడు.ఇదంతా నీవల్లే జరిగిందని తిట్టిపోస్తాడు. నీ మెడలో తాళి కట్టడం వల్లే ఇలా జరిగిందని అనడంతో ప్రేమ కోపంతో రగిలిపోతుంది. మామయ్య సాయంత్రం వరకు టైం ఇచ్చాడు కదా...అప్పటిలోగా ఆ నగలు ఏమయ్యాయో నేను చూసుకుంటానని చెప్పి వెళ్లిపోతుంది.
రామరాజును మోసం చేసి కొట్టేసిన పదిలక్షలతో ఇడ్లీ బాబాయి దంపతులు ఆనందపడిపోతారు. ఆ డబ్బులతో బాకీలు తీర్చేదామని ఆయన భార్య అంటే...లేదని ఇడ్లీ ఓ ఐడియా చెబుతాడు.తన వద్దకు ఇడ్లీలు తినేందుకు ప్రతిరోజూ మైక్ అనేవాడు ఒకడు వస్తాడని....వాడికి ఉదయం లక్ష రూపాయలు ఇస్తే...సాయంత్రానికి రెండు లక్షలు ఇస్తాడని చెబుతాడు. పెళ్లాం చెబుతున్నా వినకుండా ఆ డబ్బులన్నీ వాడికి ఇచ్చేందుకు తీసుకుని వెళ్తాడు. ఆ డబ్బులన్నీ మైక్‌కు ఇచ్చేసి పదిలక్షలకు సాయంత్రం కల్లా 20లక్షలు వస్తాయని ఆనందంతో వెళ్లిపోతాడు..
ఇంట్లో నగలు పోవడంపై బుజ్జమ్మ,నర్మద బాధపడిపోతుంటారు. బ్యాంకు నుంచి నగలు తెచ్చిన వెంటనే ప్రేమ కుటుంబానికి పంపించాం కదా...అప్పుడు అందరూ అక్కడే ఉండగా నగలు ఎలా మాయమవుతాయని బుజ్జమ్మ అంటుంది. ఒరిజనల్ నగలు ఎలా మాయమైనట్లు అని తలపట్టుకుంటారు. నగలు మాయమవ్వడం వెనక ఉన్న మాయ ఏంటో తెలుసుకుందామని నర్మద సముదాయిస్తుంది. అప్పుడు బుజ్జమ్మ నాకు నగలు పోయినందుకు టెన్షన్‌గా లేదే...దానితో ముడిపడి ఉన్న దీరజ్, ప్రేమల పెళ్లిగురించే నా భయం అంతా అని చెబుతుంది. ఆ నగలు గురించి గట్టిగా గొడవ జరిగితే...వాళ్ల పెళ్లి వ్యవహారం బయటపడుతుంది. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు....తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేమ మెడలో దీరజ్ తాళి కట్టాడని బయటపడుతుందని బాధపడుతుంది. దీరజ్,ప్రేమల పెళ్లి గురించి దాచిపెట్టామని మామయ్య మరింత గొడవ చేస్తాడని చెబుతుంది. ఉదయం ఇచ్చిన డబ్బులు రెట్టింపయ్యాయని తీసుకెళ్లేందుకు డ్యాన్స్‌వేసుకుంటూ వచ్చిన ఇడ్లీ బాబాయికి అసలు విషయం తెలిసి షాక్‌కు గురవుతాడు.మైక్ పెద్ద మోసగాడని అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారయ్యాడని తెలిసి లబోదిబోమంటాడు. పదిలక్షలు పోగొట్టిన సంగతి ఇంట్లో తెలిస్తే...తన పరిస్థితి ఏంటోనని కంగారుపడతాడు. భాగ్యం చేసిన హెచ్చరికలు గుర్తు చేసుకుని ఏడుపు లంకించుకుంటాడు.
అటు నర్మద, ప్రేమ కూడా పోయిన నగలు గురించి చర్చించుకుంటారు. బ్యాంకు లాకర్ నుంచి నగలు తీసుకురావడానికి, మీ ఇంటికి పంపించడానికి పెద్ద సమయం కూడా లేదని...ఇంతలో ఎలా మాయమయ్యాయని నర్మద అంటుంది. నువ్వు నగలు మీ ఇంటికి పంపించే సమయంలో అందరం అక్కడే ఉన్నాం కదా అంటుంది. ఒరిజనల్ నగలు స్థానంలో గిల్ట్ నగలు ఎలా వచ్చాయని ఆలోచిస్తుంటారు. అప్పుడే ప్రేమకు శ్రీవల్లి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. తిరుపతి బాబాయిని శ్రీవల్లి నగలు గురించి ప్రేమ వాళ్ల ఇంట్లో ఏమన్నారో చెప్పాలని పదేపదే అడగటంతో ఆమెకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా శ్రీవల్లే నగలు మార్చేసిందని అర్థమవుతుంది. ఇదే విషయం నర్మదకు చెబుతుంది. అలా ఎలా చెప్పగలవు అని అడగగా...ఆ రోజు తిరుపతి బాబాయి నా నగలు తీసుకుని మా ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే వరకు శ్రీవల్లి గేట్ వద్దే ఉందని...అతను రాగానే నగలు చూసుకుని వాళ్లు ఏమన్నారు అంటూ తెగ హడావుడి చేసి అడగడం నేను విన్నానని చెబుతుంది. నా నగలు గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం శ్రీవల్లికి ఏమొచ్చింది. ఆమే ఒరిజనల్ నగలు మార్చేసి....రోల్డ్‌గోల్డ్ నగలు పెట్టేసిందని అంటుంది. పైగా నగలు గురించి అందరూ బాధపడుతుంటే...ఆమెలో మాత్రం చిన్న బాధకూడా లేదని ప్రేమ అంటుంది. అదీగాక నగల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా...శ్రీవల్లి తెగ టెన్షన్ పడేది. దీని వెనక ఏదో పెద్ద గూడుపుఠానీ ఉందని...అది మనం తేల్చాలని ప్రేమ నర్మదాతో అంటుంది. దీంతో నర్మదా ముందు వెళ్లి ఆ వల్లి రూంలో వెతుకుదామని చెప్పడంతో ఈ రోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.