దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో సత్తా చాటింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో అద్భుత నటతో ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డును పొందింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా విభాగంలో 'జూబ్లీ' అవార్డును అందుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'టు కిల్ ఏ టైగర్' అవార్డును కైవసం చేసుకుంది. ‘ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’లో అద్భుత నటనతో ఆకట్టుకున్న రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్)గా అవార్డు పొందింది. ‘ఆగ్రా’ సినిమాలో నటనకు గాను మోహిత్ అగర్వాల్ బెస్ట్ యాక్టర్ (మేల్) అవార్డును పొందారు. ‘కొననూర్’ మూవీకి దర్శకత్వం వహించిన పృథ్వీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. మెల్‌బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి.
పాన్ ఇండియా రేంజి హిట్ అందుకున్న ‘సీతారామం’
ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెప్పించారు. ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జోరు కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85 కోట్లు సాధించింది. తెలుగులో రూ. 40 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుత నటన కనబర్చారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది.
‘సీతారామం’పై దిగ్గజ దర్శకుల ప్రశంసలు
‘సీతారామం’ సినిమాపై పలువురు దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘ది కార్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘సీతారామం’ ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించారు. నార్త్ టు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడి ప్రతిభను, హీరో, హీరోయిన్ల నటనను అభినందించారు. ఈ సినిమా బాగా లేదని ఏ ప్రేక్షకుడు కూడా చెప్పకపోవడం విశేషం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పాత్రలను దర్శకుడు మలిచిన తీరుపై అద్భుతం అని కొనియాడారు. ఆర్మీ, విదేశీ రహస్యాలు, ప్రేమకథ కలగలుపుగా కొనసాగిన అద్భుత చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ ఛాయలున్న క్యారెక్ట్ చేశాడు.
Read Also: ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial