సౌత్ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు అల్లు అర్జున్. అంతేకాదు, అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లోనూ ఆయన టాప్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ సైతం చాలా రిచ్ గా ఉంటుంది. వేసుకునే బట్టల నుంచి ప్రయాణించే వాహనాల వరకు చాలా ఖరీదైనవి వాడుతారు. అంతేకాదు, విలాసవంతమైన బంగళాలతో పాటు పలు ఆస్తులను కలిగి ఉన్నారు. ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఖరీదైన వస్తువులను ఇష్టపడుతుంది.
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున ఇవాళ(ఏప్రిల్ 8న) బర్త్ డే జరుపుకుంటున్నారు. 41 ఏండ్లు పూర్తు చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన దగ్గరున్న ఐదు ఖరీదైన వస్తువుల గురించి తెలుసుకుందాం..
1.విలాసవంతమైన వానిటీ వ్యాన్
అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువులలో వ్యానిటీ వ్యాన్ ఒకటి. నలుపు రంగును ఇష్టపడే బన్నీ, ఈ వ్యాన్ ను కూడా అదే రంగులో తయారు చేయించుకున్నారు. ఇందులో టీవీ, ఫ్రిజ్ తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ తో తయారు చేయబడింది. అతడు తరచుగా షూట్‌ల మధ్య ఈ విలాసవంతమైన వ్యాన్‌లో సేద తీరుతుంటారు. దీని విలువ రూ. 7 కోట్లు. వాస్తవానికి, ఈ వ్యాన్‌కు ఫాల్కన్ అని పేరు పెట్టారు. వ్యాన్ బయట తన పేరులోని అక్షరాలను('AA') పొందుపర్చారు.
2.రూ.100 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం
అల్లు అర్జున్ విలాసవంతమైన ఆస్తుల జాబితాలో అతడి కలల ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్‌లో ఆయనకు రూ. 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. అతడు తన తల్లిదండ్రులు, భార్య అల్లు స్నేహ, పిల్లలు అర్హా, అయాన్‌లతో ఇందులోనే నివసిస్తున్నారు. ఇల్లు మొత్తం మినిమలిస్ట్ వైబ్‌ను కలిగి ఉంది. సహజమైన తెలుపు రంగులో పెయింట్ చేయబడింది. బ్లెస్సింగ్ అని పిలవబడే ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్, పిల్లల కోసం ప్లే ఏరియా ఉన్నాయి.
3.హమ్మర్ H2
అల్లు అర్జున్‌కి కార్లంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం చాలా ఇష్టం. రూ. 75 లక్షలకు పైగా ఖరీదు చేసే హమ్మర్ H2 కారును కొనుగోలు చేశారు. ఇది అత్యంత ప్రసిద్ధ కార్లలో ఒకటి.
4.రేంజ్ రోవర్, ఇతర కార్లు
అల్లు అర్జున్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన కారు రేంజ్ రోవర్ కొలువుదీరింది. 2019లో అందమైన రేంజ్ రోవర్ వోగ్‌ను ఆయన కొనుగోలు చేశారు. దానికి 'బీస్ట్' అని పేరు పెట్టారు. ఈ కారు ఖరీరు రూ. 1.8 నుండి 4 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అంతేకాదు, జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌ను కూడా కలిగి ఉన్నారు. దాని ఖరీదు రూ. 1.2 కోట్లు. అతడి గ్యారేజీలో వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి.
5.ప్రైవేట్ జెట్
అల్లు అర్జున్‌కు విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. జెట్ ఖరీదు తెలియదు కానీ, అతను తరచుగా తన కుటుంబంతో కలిసి ఇందులో సెలవులకు వెళ్తాడు. బన్నీ, స్నేహ పలుమార్లు వారి ప్రైవేట్ జెట్ ఫోటోలను తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రైవేట్ జెట్ లు కలిగి ఉన్న కొద్ది మంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు.
బన్నీ నికర ఆస్తుల విలువ
ఇది కాకుండా, అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నైట్ క్లబ్ ను రన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆధారిత కాల్ హెల్త్ సర్వీసెస్ అనే హెల్త్ కేర్ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాడు. తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు, అతడు OTT ప్లాట్ ఫారమ్ ‘ఆహా’ను స్థాపించారు. అతడి కుమార్తె పేరుతో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ రూ. 350 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తారు. తన రాబోయే చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ కోసం రూ. 100 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?