దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనిద్వారా మొత్తం 39 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 39

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.

విభాగాలు..

1. బయోటెక్నాలజీ (బీటీ)

2. కెమికల్ ఇంజినీర్(సీహెచ్)

3. కెమిస్ట్రీ (సీవై)

4. సివిల్ ఇంజినీర్(సీఈ)

5. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్(సీఎస్)

6. ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్(ఈఎస్)

7. ఎలక్ట్రికల్ ఇంజినీర్(ఈఈ)

8. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్(ఈసీ)

9. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(హెచ్ఎస్ఎస్)

10. మేనేజ్‌మెంట్ స్టడీస్(ఎంఎస్)

11. మ్యాథమెటిక్స్(ఎంఏ)

12. మెకానికల్ ఇంజినీరింగ్(ఎంఈ)

13. మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజినీరింగ్(ఎంఎంఈ)

14. ఫిజిక్స్(పీహెచ్) 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 06 ఏళ్లు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

జీతభత్యాలు:  

  • ప్రొఫెసర్లు: నెలకు రూ.159100-రూ.220200 చెల్లిస్తారు.
  • అసోసియేట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.139600-రూ.211300 చెల్లిస్తారు.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.70900-రూ.167400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: Registrar, NIT Durgapur, Mahatma Gandhi Avenue, Durgapur 713209, West Bengal, India.

దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification 

Website 

Also Read:

ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...