‘ఆస్కార్’ వంటి అంతర్జాతీయ వేదికపై మన తెలుగు పాట మార్మోగనుంది. మరి, ఈ అరుదైన, చారిత్రక ఘట్టాన్ని మళ్లీ మళ్లీ చూడగలమా? మరి, అమెరికాలో జరిగే ఆస్కార్ వేడుకలను ఇండియాలో ఎలా చూడగలం అనేగా మీ సందేహం? ఇదిగో ఇలా చూడండి. 


ఆస్కార్ అవార్డుల వేడకకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రతి ఏటా ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి కూడా ఆస్కార్ బరిలో నిలుస్తుంటాయి. అయితే ఈసారి మన దేశం నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఓ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుండటంతో యావత్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలోకి ఎంపికైంది. దీంతో ఈసారి ఆస్కార్ అవార్డులపైనే అందరి చూపులు ఉన్నాయి. అందుకే భారత ప్రజలు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను లైవ్ లో చూడటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ వేదిక కానుంది. 


లైవ్ లో ఆస్కార్ అవార్డుల వేడుకలు..


ఈసారి జరిగే ఆస్కార్ అవార్డుల వేడకను లైవ్ లో చూడటానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. దీనికోసం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు హాట్ స్టార్ అధికారికంగా ఇటీవలే ఓ ప్రకటన చేసింది. భారత్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఎక్కువ మంది ఫాలోఅవున్నారు. ఈ నేపథ్యంలో ఈ లైవ్ ద్వారా  ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ 95వ ఆస్కార్ అవార్డులను లైవ్ ద్వారా చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. 


ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా అవార్డులు కూడా వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో ఐదు విభాగాల్లో హెచ్సీఏ అవార్డులు కైసవం చేసుకోవడంతో ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ కు కూడా ఆస్కార్ అవార్డు కూడా వస్తుందనే నమ్మకంతో ఉంది మూవీ టీమ్. అలాగే యావత్ భారత ప్రజలు కూడా ఈ అవార్డుల వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకలో ‘నాటు నాటు’ పాటను అంతర్జాతీయ వేదికగా లైవ్ లో ప్రదర్శన చేయనున్నారు. ఈ పాటను లైవ్ లో చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్


ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ అమెరికా బయలుదేరింది. ప్రస్తుతం చిత్ర బృందం అమెరికాలో పర్యటిస్తోంది. దర్శకుడు రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ అంతర్జాతీయ మీడియా సంస్థలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా అమెరికాలోని ఫ్యాన్స్ ను కలసి మాట్లాడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మార్చి 13న జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుకల్లో మూవీ టీమ్ ‘నాటు నాటు’ పాటను అంతర్జాతీయ వేదికపై లైవ్ ప్రదర్శన చేయనున్నారు. దీంతో ఇండియన్స్ తో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావాలని యావత్ భారత ప్రజలు ప్రార్థిస్తున్నారు.


Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్