కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' అనే సినిమాలో నటించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'అరబిక్ కుతు' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటకు శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో విజయ్ స్టైలిష్ అండ్ క్లాస్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట ఇంత హిట్ అవ్వడానికి అనిరుధ్ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటు శివకార్తికేయన్ అందించిన లిరిక్స్ అని చెబుతున్నారు నెటిజన్లు. 


వీజే స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్ కి కోలీవుడ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కూడా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే త్వరలోనే తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హీరోగానే కాకుండా.. నిర్మాతగా, సింగర్ గా, లిరిక్ రైటర్ గా తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇదివరకు నయనతార నటించిన 'కొలమావు కోకిల' సినిమాలో 'కల్యాణ వయసు' సాంగ్ రాశారు.


తన సినిమాల్లో కొన్ని పాటలు రాసుకోవడంతో పాటు స్టార్ హీరో సూర్య నటిస్తోన్ కొత్త సినిమాకి కూడా లిరిక్స్ అందిస్తున్నారు. ఇప్పుడు 'బీస్ట్' సినిమాలో అరబిక్ కుతు అనే పాట రాసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అరబిక్ భాషలో కొన్ని హమ్మింగ్ పదాలను సేకరించి వాటికి తమిళ పదాలను యాడ్ చేసి ఈ పాట రాశానని చెబుతున్నారు శివకార్తికేయన్. 


అయితే ఈ పాట ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్ ఫ్యామిలీకి అందజేసి మంచి మనసు చాటుకున్నారు ఈ హీరో. దీంతో సోషల్ మీడియాలో ఈ హీరోని తెగ పొగిడేస్తున్నారు. ఇక 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెల్సన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.