Honeymoon Express Telugu Movie First Look: '30 వెడ్స్ 21' యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు చైతన్య రావు. ఆ తర్వాత ఆయన సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ కూడా చేశారు. ఇటీవల 'కీడా కోలా'లో సందడి చేశారు. ఇప్పుడు ఆయన సోలో హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లుక్ వచ్చింది.
రొమాంటిక్ కామెడీగా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'చైతన్య రావు (Chaitanya Rao Madadi) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' (Honeymoon Express Telugu Movie). ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్. ఎన్ఆర్ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కెకెఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సుహాసిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీత దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న చిత్రమిది.
ఫస్ట్ లుక్ విడుదల చేసిన కింగ్ నాగార్జున!Nagarjuna Akkineni released Honeymoon Express First Look: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా ఫస్ట్ లుక్ కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'బిగ్ బాస్' హౌస్ సెట్‌లో కింగ్ రూములో విడుదలైంది. అనంతరం నాగార్జున మాట్లాడుతూ... ''దర్శకుడు బాల నాకు చాలా సుపరిచితులు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (annapurna film institute)కి డీన్ గా వ్యవహరించారు. హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు చెప్పారు. ఈ సినిమాలో మా విద్యార్థులకు అవకాశాలు ఇచ్చారు. సినిమాలో వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాదించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.
Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా... తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వరాలు: కల్యాణి మాలిక్, నేపథ్య సంగీతం: ఆర్పీ పట్నాయక్, సాహిత్యం: కిట్టూ విస్సప్రగడ, కళా దర్శకత్వం & ఛాయాగ్రహణం: శిష్ట్లా విఎమ్కే, కూర్పు: ఉమా శంకర్ జి (యుఎస్ఎ) & శ్రీ కృష్ణ అత్తలూరి.