ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ హాట్ బ్యూటీ. ఈ అమ్మడు నిత్యం వింత డ్రెస్సుల్లో కనిపిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఆమె మాదిరిగా మరే ఇతర హీరోయిన్లు కూడా డ్రెస్సులు వేసుకోరని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఆమె వేసుకునే డ్రెస్సులను చూసి చాలా మంది బాబోయ్ ఇదేం డ్రెస్సులు అనుకున్న సందర్భాలున్నాయి. పేపర్ డ్రెస్సులు, వైర్లు, చైన్లు, గోనె సంచులు, అద్దాలు ఒకటేమిటీ సవాలక్ష వింత డ్రెస్సింగ్ లో కనిపిస్తుంటుంది. కంటికి కొత్తగా ఏది కనిపించినా డ్రెస్సులు మార్చేస్తుంది.    


వింత డ్రెస్సులకు కేరాఫ్ అడ్రస్


వాస్తవానికి ఈమె వేసుకునే డ్రెస్సులు పలు మార్లు వివాదాస్పదం అయ్యాయి. చాలా మంది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మరికొంత మంది బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. తాజాగా ఆమె విచిత్ర డ్రెస్సింగ్ మీద ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా మరోసారి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చంపేస్తానంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు.  హిందుస్థానీ భావు అనే వ్యక్తి తాజాగా ఉర్ఫీని చంపేస్తానంటూ బెదిరించాడు. “ఉర్ఫీ జావేద్, నీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా అసభ్యకరంగా ఉంది. ఇలాంటి అర్థనగ్న డ్రెస్సులు వేసుకోవడం మానేయాలి. ఈ డ్రెస్సింగ్ స్టైల్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం. మరోసారి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తా” అంటూ భావు హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు.  


చంపేస్తానంటూ బెదిరింపులు, తీవ్రంగా స్పందించిన ఉర్ఫీ


అటు హిందుస్థానీ భావు వార్నింగ్ పై ఉర్ఫీ జావేద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా మండిపడింది. సామాజిక మాద్యమాల్లో చాలా మంది తనకపై అసభ్య రీతిలో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత మంది తమను చంపేస్తామని బెరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై వస్తున్న వేధింపులపై ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. “ మీరు నన్ను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. నేనే కనుక తలుచుకుంటే మిమ్మల్ని జైల్లో వేయించగలను. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినా, నేను అలాంటి పని చేయను. నాకు ఏది నచ్చితే ఆ పని చేస్తాను. నాకు నచ్చిన డ్రెస్సులు నేను వేసుకుంటాను. మీరు నాకు  సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి బెదిరింపుల మూలంగా తనకు బాధతో పాటు భయం వేస్తోంది” అని ఉర్ఫీ వెల్లడించింది.


టీవీ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం


ఇక ఉర్ఫీ జావేద్ ‘బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా’ సీరియ‌ల్‌  ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.  ‘మేరీ దుర్గా’తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఓటీటీలో  బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లొచ్చాక ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఈమె వేసుకునే బట్టల మూలంగా పలుమార్లు ట్రోలింగ్ కు గురయ్యింది.


Read Also: ఓటీటీలోకి ‘సీతారామం‘, హిందీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?