టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. హీరోలకు తగిన సంఖ్యలో హీరోయిన్లు లేరనేది నిజం. అందుకే ఉన్న హీరోయిన్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. పైగా హీరోయిన్ల డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి కలుగుతోంది. భారీ బడ్జెట్ సినిమా అంటే స్టార్ హీరోయిన్ ను కచ్చితంగా తీసుకోవాలి. అయితే వాళ్లను మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టంగా మారుతోంది. 


సమంత, రష్మిక, పూజాహెగ్డే, కాజల్ ఇలా అందరూ స్టార్ హీరోయిన్లే. వీరు ఒక్కో సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమాను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. నిర్మాతలు కూడా వారు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కానీ హీరోయిన్ల ఎక్స్ట్రా ఖర్చు మాత్రం నిర్మాతలకు భరించడం కష్టంగా మారింది. 


హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటు.. వాళ్లతో పాటు ఉండే స్టాఫ్ ను కూడా నిర్మాతలే భరించాల్సి వస్తుంది. ఒక్కో హీరోయిన్ దగ్గర కనీసం పది మంది వరకు స్టాఫ్ ఉంటారట. మేకప్ కోసం ఇద్దరు, హెయిర్ స్టైలింగ్ కోసం ఇద్దరు, బౌన్సర్లు వీరందరి జీతాలు, భోజనాలు, హోటల్ రూమ్ ఖర్చులు నిర్మాతలే భరించాలట. ఒక స్టార్ హీరోయిన్ కి రెమ్యునరేషన్ కాకుండా.. రోజుకి లక్ష వరకు ఖర్చవుతుందట. 


ఒక్క భోజనం ఖరీదు రూ.15 వేల వరకు ఉంటుందట. హీరోయిన్ భోజనం చేసినా.. చేయకపోయినా.. పదిహేను వేలు ఇచ్చేయాల్సిందేనట. ఇలా ఒక స్టార్ హీరోయిన్ ను సినిమాలో తీసుకుంటే ఈ ఖర్చులన్నీ భరించాల్సిందేనని చెబుతున్నారు నిర్మాతలు. కానీ హీరోయిన్లు మాత్రం హీరోలకు ఇచ్చే దాంతో పోలిస్తే మాది కూడా ఒక రెమ్యునరేషనా..? అని ప్రశ్నిస్తున్నారు.