Tanvi Negi About SiddharthRoy Bold Scenes: దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నేగి హీరోయిన్ గా నటించిన రీసెంట్ మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’. వి యశస్వీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలైన యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఆదరణ దక్కించుకుంది. వసూళ్ల పరంగానూ డీసెంట్ గా రాణించింది.


ఆ సీన్లు చేసేటప్పుడు ఏం చేశారంటే?- తన్వి


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న‘సిద్ధార్థ్ రాయ్’ హీరోయిన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్లో వివరించింది. బోల్డ్ సన్నివేశాలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పింది. “బోల్డ్, రొమాంటిక్ సీన్లు చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతారు. కానీ, మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. దర్శకుడు ముందుగానే వర్క్ షాపులు నిర్వహించే వారు. ఎలా చేస్తే ఆయా సీన్లు బాగా వస్తాయి అని చర్చించే వారు. అందుకే, ఆ సీన్లు చేసే సమయంలో పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. ఎప్పుడైనా కంఫర్టబుల్ గా ఫీల్ అయితే, కాస్త ఆపమని చెప్పేవాళ్లం. హీరో కూడా చాలా జాగ్రత్తగా వ్యవరించే వాడు. నా మీద చేతులు వేసే సమయంలో నేను ఇబ్బంది పడకుండా చూసుకునే వాడు. ఇలా చేస్తే ఓకేనా? అలా చేస్తే ఓకేనా? అని అడిగే వాడు. నేను ఎప్పుడూ అన్ కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు. కొన్ని సీన్లలో నటించే సమయంలో పర్ఫెక్ట్ గా వచ్చేందుకు కొన్ని జాగ్రత్తలు తీసకునే వారు. బ్యాగ్రౌండ్ లో కొన్ని పాటలను ప్లే చేసేవారు. ఫీల్, కిస్సింగ్ డ్యూరేషన్ కోసం ఆ పాటలు బాగా ఉపయోగపడేవి” అని చెప్పుకొచ్చింది.


బోల్డ్ సీన్లతో నిండిన ‘సిద్ధార్థ్ రాయ్’


ఇక ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా బోల్డ్ సీన్లతో నిండిపోయింది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపక్ చెప్పిన బోల్డ్ డైలాగులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వర్జినిటీని 17 సంవత్సరాలకు కోల్పోయానని చెప్పడం, అమ్మాయిని సిగరెట్ ఉందా? లేదంటే కండోమ్ ఉందా? అంటూ అడగడం సహా మాంచి మసాలా దట్టించిన డైలాగులు సినిమాలో కోకొల్లలుగా కనిపించాయి. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలకు కొదవేం లేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా సిద్ధార్థ్ రాయ్, అతడి ఎమోషన్‍ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించే పాత్రలో హీరోయిన్ బాగా నటించారు.


‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు.


Read Also: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల