Syed Sohel Emotional Speech At Bootcut Balaraju Pre Release Event: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సయ్యద్ సోహెల్. మంచి ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, వరుస సినిమా అవకాశాలతో వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

  


విడుదలకు రెడీ అవుతున్న ‘బూట్ కట్ బాలరాజు‘


సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమా తెరకెక్కింది. కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్ర‌జ‌, సునీల్, సిరి హన్మంతు, జ‌బ‌ర్ద‌స్త్ రోహిణి, ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.


ఒక్క రూపాయి తీసుకుండా యాంకరింగ్ చేసిన సుమ


తాజాగా ‘బూట్ కట్ బాలరాజు‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సోహెల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యాంకర్ సుమ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. “మేము ఉన్న పరిస్థితిని సుమ అక్కకు చెప్పాం'' అని సోహైల్ తెలిపారు. “నేను పేరు సంపాదించుకున్నాను. డబ్బు సంపాదించుకున్నాను. నా కొడుకును ప్రమోట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో? నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. మీ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసు. మీ దగ్గర ఉంటే తీసుకునేదాన్ని. అయినా, మీ లాంటి వాళ్లకు హెల్ఫ్ చెయ్యకపోతే ఎలా? నేను వస్తున్నాను. ఫ్రీగా ఈవెంట్ చేస్తున్నాను” అని సుమ చెప్పారని సోహెల్ తెలిపారు. ''మా కష్టం తెలుసుకుని వచ్చిన సుమక్కకు థ్యాంక్స్” అని చెప్పాడు సోహెల్.


వాస్తవానికి యాంకర్ సుమ ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రూ. 5 లక్షల చొప్పున తీసుకుంటుందని టాక్. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాల ఈవెంట్లను మాత్రమే చేస్తుంది. అయినప్పటికీ, చిన్న హీరో సోహెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా చేసింది. అదీ ఉచితంగా చేయడం విశేషం. సుమా యాంకరింగ్ చేయడం ఈ సినిమా కూడా కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేయగా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వ్యవహరించారు. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా కొనసాగారు.  






Read Also: ఒక్క పోస్ట్‌తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి - వెకేషన్‌ మోడ్‌లో జ్యోతిక.. పోస్ట్‌ వైరల్‌