హీరో రామ్ పోతినేని నటిస్తున్న #RAP19 షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా కోసం రామ్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో రామ్ మెడకు అంతర్గతంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వంశీ కాక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘బాడీ ట్రాన్సఫర్మేషన్ వల్ల రామ్ మెడకు గాయం కావడంతో #RAP19 షూటింగ్‌ను మధ్యలో నిలిపివేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న రామ్ ఫొటోను పోస్ట్ చేశారు.
జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా రామ్ మెడ ఒక్కసారిగా పట్టేసిందని, వైద్య పరీక్షల్లో అంతర్గత గాయాలైనట్లు తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని రామ్‌కు సూచించినట్లు తెలిసింది. దీంతో రామ్ నటిస్తున్న చిత్రాల షూటింగులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుల సీన్స్ మాత్రమే తెరకెక్కించనున్నారు.
‘రెడ్’ సినిమా తర్వాత మళ్లీ రామ్ ఏ చిత్రంలోను నటించలేదు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామితో రామ్ తన 19వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి ‘సీటీమార్’ చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి